పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.
కరోనా ఫస్ట్ వేవ్ నుండి ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది.
ఈసారి కూడా వాయిదా పడడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేసారు.
తమ అభిమాన హీరోను వెండి తెర మీద చూసాక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.అందుకే రాధేశ్యామ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఎట్టకేలకు అన్న అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కానున్నట్టు ఇటీవలే ప్రకటించారు.
అందుకు పనులు కూడా చెకచెకా చేసేస్తున్నారు.
తాజాగా రాధేశ్యామ్ హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తి అయినట్టు తెలుస్తుంది.
నిర్మాతలు ఈ సినిమా కోసం మంచి ఇంట్రెస్టింగ్ క్రిస్పీ రన్ టైమ్ లాక్ చేసినట్టు టాక్.ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 31 నిముషాలు ఉందని సమాచారం.ఇంత భారీ బడ్జెట్ సినిమాకు ఇలాంటి రన్ టైమ్ లాక్ చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
అయితే హిందీ వెర్షన్ ను చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసారు.ఈ సినిమాకు తెలుగు కంటే భిన్నమైన సౌండ్ ట్రాక్ హిందీ సినిమాకు ఉంటుందట.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ సినిమాలో కృష్ణం రాజు కూడా కీలక పాత్రలో కనిపించ బోతున్నారు.