కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేరెత్తితేనే సీఎం కేసీఆర్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది.వరిసాగు, వడ్ల కొనుగోలు విషయంలో ఏకంగా రోడ్లెక్కి నిరసనలు తెలిపారు.
బీజేపీ పై కేసీఆర్‌కు ఉన్న ఆక్రోశం ఇటీవల స్పష్టగా కనిపించింది.కేంద్రం నియమించిన రాష్ట్ర గవర్నర్ తమిళ్‌సై సుందర్ రాజన్ విషయంలో దూరం పాటిస్తున్నారు.
జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలు రాజ్‌భవన్‌లో జరిగాయి.గవర్నర్ పాల్గొన్నా సీఎం కేసీఆర్ మాత్రం దూరంగా ఉన్నారు.
అక్కడికి వెళ్లకుండా ప్రగతిభవన్‌లోనే జెండా ఎగరేయడం చర్చలకు తావిచ్చింది.ఇది మరువకముందే సీఎం కేసీఆర్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఈ నెల 5న జరిగే శ్రీరామానుజాచార్యల సహస్రాబ్ధి ఉత్సవాలకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు.ఈ నేపథ్యంలో మోడీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ నిరాసక్తత కనబరుస్తుండడం మరోసారి విమర్శలకు తావిస్తోంది.
తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏకంగా నిప్పులే చెరిగాడు.ప్ర\శ్నల అస్త్రాలతో మోడీనీ ఇరుకున పెట్టేందుకు యత్నించాడు.
కేంద్రంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విరుచుకపడ్డాడు.ఈ క్రమంలోనే మోడీ రాకకు స్వాగతం పలికేందుకు దూరం పాటిస్తున్నట్టు తెలిస్తోంది.
అంతకుముందు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్టు వ్యవహరించారు.పలుమార్లు చర్చల పేరిట ఢిల్లీ వెళ్ళి మోడిని కలిశారు.ఎప్పుడైనా హైదరాబాద్‌కు మోడీ వస్తే అన్ని మర్యాదలతో స్వాగతం పలికేవారు.ఇలాంటి విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.రాజ్యంగం అనుసరించి ప్రోటోకాల్ పాటించాల్సిందే.రాజకీయంగా జరిగే బేటీలకు ఎవరైనా సరే హాజరు కావాల్సిందే.కానీ, నేడు రాజకీయాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి.దీంతో ప్రోటోకాల్అనే పదానికి అర్థం లేకుండా పోతోంది.ఇందుకు ఇటీవల సీఎం తీసుకుంటున్న వ్యక్తిగత నిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.కేంద్ర పాలకులతోనే గాకుండా గవర్నర్‌తో కూడా బేధాలున్నట్టు సమాచారం.
అలాగే మోడీపై ఉన్న వ్యతిరేక కారణంగా రాష్ట్రానికి వచ్చే మోడీకి స్వాగతం పలకొద్దని నిర్ణయం తీసుకున్నారని, కేసీఆర్‌కు బదులు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పలుకుతారనే చర్చ జరుగుతోంది.ప్రోటోకాల్ రూల్స్ పాటించకుండా విబేధాలకు పోతే రాజకీయ రణరంగం ఎటు దారితీస్తుందోక వేచి చూడాల్సిందే.