వెంకీ, సూర్య.. ఒకేలా అడుగులు వేస్తున్న స్టార్ హీరోస్..

సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు.హీరోయిన్ల అంద చందాల ప్రదర్శనేనా.

 Venky And Surya Same Steps In Industry , Venky , Surya, Narappa, Drushyam 2 , To-TeluguStop.com

ఎప్పుడూ రొటీన్ మసాలా కథలేనా.కొత్త సినిమాలు చేద్దాం బాస్.

ఇదే దిశగా అడుగులు వేయడంలో సిద్ధ హస్తులు ఇద్దరు హీరోలు.వారిలో ఒకరు తమిళ స్టార్ హీరో సూర్య.

మరొకరు తెలుగు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.వీరిద్దరు ఓవైపు రొటీన్ సినిమాలు చేస్తూనే.

మరో వైపు ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తారు.వీరిద్దరి శైలి కూడా ఇంచు మించు ఒకే రీతిలో ఉంటుంది.

అంతేకాదు.గడిచిన కొంత కాలంగా వెంకీ, సూర్య సినీ జర్నీ సేమ్ టు సేమ్ అన్నట్లు గా ముందుకు సాగుతుంది.కరోనా సమయంలో వీరు నటించిన రెండు సినిమాలు ఓటీటీలోనే స్ట్రీమ్ అయ్యాయి.ఈ రెండు సినిమాలు కూడా మంచి జనాదరణ అందుకున్నాయి.

తాజా సినిమాలు మాత్రం సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Telugu Amazon Prime, Drushyam, Et, Ppa, Surya, Tollywood, Venkatesh, Venky, Venk

విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన రెండు సినిమాలు నారప్ప, దృశ్యం 2.ఈరెండు సినిమాలు కూడా ఓటీటీ వేదిక మీదే దర్శనం ఇచ్చాయి.ఈ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యాయి.

అటు సూర్య నటించిన సూరారై పోట్రు తెలుగులో ఆకాశం నీహద్దురాతో పాటు జై భీమ్ సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి.ఈ రెండు సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమ్ అయ్యాయి.

వీరిద్దరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు.తాజాగా వీరిద్దరు చేస్తున్న సినిమాలు థియేటర్లలో విడుదలకు రెడీ అవుతున్నాయి.

వెంకీ నటించిన సినిమా ఎఫ్-3.సూర్య కొత్త సినిమా ఎద‌ర్కుమ్ తుణింద‌వ‌న్.

ఈ రెండు కూడా జనాల ముందుకు థియేటర్ల ద్వారా వస్తున్నాయి.ఓటీటీలో మంచి హిట్స్ అందుకున్న వెంకీ, సూర్యకు జనాలు ఈ సారి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి.

అటు వెంకీ నటించిన ఎఫ్3 సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.అటు సూర్య నటించిన ఈటీ సినిమా మార్చి 10న పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube