వింటర్ ఒలింపిక్స్‌కి షాక్ ఇచ్చిన కరోనా.. ఇంకా స్టార్ట్ కాకుండానే నమోదౌతున్న భారీగా కేసులు..!

అవును.కరోనా ఎవరినీ వదలట్లేదు.

 Corona Shocks Winter Olympics, Winter Olympics, Latest News, Viral Latest, Viral-TeluguStop.com

దాని నుండి తప్పించుకోవడం అంత తేలికైన విషయం కాదు మరి.వివరాల్లోకి వెళితే.2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానుండగా కరోనా భారీ షాక్ ఇచ్చింది.ఇప్పటికే అక్కడ భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ క్రమంలో నిన్న అనగా ఫిబ్రవరి 2న ఇక్కడ కరోనా కొత్త వేరియంట్ అయినటువంటి ఓమైక్రాన్ కలకలం సృష్టించింది.ఒక్కసారిగా అత్యధిక కేసులు నమోదు కావడంతో ఒలింపిక్ అధికారులు ఇపుడు అయోమయంలో పడ్డారు.

నిన్న ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన సిబ్బందిలో మొత్తం 55 కొత్త కోవిడ్ – 19 ఇన్‌ఫెక్షన్‌లు కనిపించాయని బీజింగ్ 2022 వైద్య నిపుణుల ప్యానెల్ ఈరోజు ప్రకటించింది.కాగా ఇప్పటివరకు ఇక్కడ వెలుగుచూసిన రోజువారీ కేసుల సంఖ్య కంటే ప్రస్తుతం అక్కడ నమోదు అవుతున్న కేసుల సంఖ్య అత్యధికం కావడం గమనార్హం.

కొత్తగా విమానాల రాకపోకలకు సంబంధించి 29 కేసులు కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు.వింటర్ ఒలింపిక్స్ అధికారిక ప్రారంభానికి ముందు రోజు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌లో బ్రియాన్ మెక్‌క్లోస్కీ వెల్లడించారు.

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, జనవరి 23 నుంచి మొత్తం 610,000 పరీక్షలలో క్రీడలకు సంబంధించిన సిబ్బందిలో దాదాపుగా 297 మంది పాజిటివ్‌గా తేలడం బాధాకరం.ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ క్రీడలు కంటిన్యూ చేయడం అనేది పెద్ద రిస్కుతో కూడుకున్న విషయం అని క్రీడా శాఖవారు అభిప్రాయ పడుతున్నారు.

ఒలింపిక్స్ కంటే స్థానిక ప్రజలు, క్రీడాకారుల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని వారు భావిస్తున్నారు.సో ఒలింపిక్స్ క్రీడాభిమానులు ఇది ఓ రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube