పుట్టు మచ్చల గురించి ప్రశ్నించిన జర్నలిస్ట్‌కి మతి పోయే ఆన్సర్‌ ఇచ్చిన హీరోయిన్‌

సిద్ధు జొన్నలగడ్డ హీరో గా నేహా శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే.ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 Dj Tillu Trailer Launch Event Heroine Fire On Suresh Kondeti , Dj Tillu , Flim N-TeluguStop.com

ట్రైలర్‌ రొమాంటిక్ గా ఉందని.యూత్‌ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్‌ ఈ సినిమా లో ఉందంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియా తో మాట్లాడిన చిత్ర యూనిట్ సభ్యులు కొందరు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.ఆ సమయం లో జర్నలిస్టు సురేష్ కొండేటి అడిగిన ఒక ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ట్రైలర్ లో హీరో సిద్ధూ హీరోయిన్ పుట్టు మచ్చల గురించి మాట్లాడుతాడు 16 మచ్చలు ఉన్నాయి నీకు అంటూ వ్యాఖ్యలు చేసాడు.ట్రైలర్ లో ఉన్న ఆ సన్నివేశాన్ని గురించి ప్రస్తావిస్తూ సినిమాలో హీరోయిన్ కి 16 పుట్టు మచ్చలు ఉన్నాయన్నారు.

మరి నిజంగా ఆమె ఎన్ని పుట్టు మచ్చలు కలిగి ఉందో చూశారా అంటూ ప్రశ్నించాడు.

జర్నలిస్ట్‌ అడిగిన ఆ ప్రశ్న వివాదాస్పదం అయ్యింది.ఆ ప్రశ్నకు సిద్ధు సమాధానం దాట వేశారు.ఇలాంటి ప్రశ్నలు కరెక్ట్ కాదు అన్నట్లుగా ఆయన అసహనం వ్యక్తం చేశాడు.

ఆ విషయం లో హీరోయిన్ నేహా శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సురేష్ కొండేటి మాట్లాడిన వీడియో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.మీడియా సమావేశం లో ఇలాంటి సిల్లీ క్వశ్చన్ అడగడం ఏంటి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతే కాకుండా ఆమె సదరు జర్నలిస్టు పై తీవ్ర స్థాయి లో విమర్శలు గుప్పించింది.మీ చుట్టూ ఉన్న ఆడ వారితో ఇలాగే ప్రవర్తిస్తారా వారిని ఇలాగే గౌరవిస్తారా అంటూ సోషల్ మీడియా లో సదరు జర్నలిస్టుని చెంప దెబ్బ కొట్టినట్లుగా ప్రశ్నించింది.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.హీరోయిన్ ఇచ్చిన సమాధానానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.అలాంటి జర్నలిస్టు కు ఇలాగే సమాధానం చెప్పాలంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Actress Neha Shetty Strong Counter to Reporter DJ Tillu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube