గత కొంత కాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.పదే పదే బీజేపీ అగ్రనేతలను విమర్శిస్తూ జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో రకాల విమర్శలు చేస్తున్నారు .2023 ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకోవడంతో పాటు, దేశ వ్యాప్తంగా బీజేపీ కి ఎన్నికల్లో ఎదురు గాలి వీచే విధంగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత ఆధ్వర్యంలో తెరపైకి వస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి లో కీలకం అయ్యేదుకు, బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు పొందేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా భారత రాజ్యాంగాన్ని మార్చాలి అంటూ కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనిపై బీజేపీ గరంగరం అవుతోంది.దీంతో కేసీఆర్ ఒక్కసారిగా స్పీడ్ పెంచడానికి కారణాలు ఏమిటన్న విషయం అవుతోంది.
అయితే ఇదంతా టిఆర్ఎస్ కు రాజకీయ సలహాలు అందించేందుకు సిద్ధమైన ప్రశాంత్ కిషోర్ సూచనలే కారణమనే ప్రచారం తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ గెలిచేందుకు పాత విధానాలు ఏ మాత్రం పనికిరావని, బీజేపీ ని ఇరుకున పెట్టేందుకు సంచలన ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా మాత్రమే టిఆర్ఎస్ కు రాజకీయంగా ఆశించిన మేలు జరుగుతుందని ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇచ్చారట.ఆయన సలహాలు సూచనలతోనే కెసిఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఎన్నో పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్నారు.
నేరుగా ఆయన వ్యూహకర్తగా పని చేయకుండా , తనకు చెందిన ఐ ప్యాక్ టీమ్ ద్వారా రాజకీయ వ్యూహాలను, సలహాలను అందిస్తున్నారు.దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీల ను ఏకం చేసే పనిలో ఉన్నారు.