ఇరవై ఎనిమిది మంది ఎంపీలు కలిగిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సాధన విషయంలో సాధించింది.ఏమీ లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.బడ్జెట్ కేటాయింపులో పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు ఎక్కడ కేటాయించారని ప్రశ్నించారు.22 మంది వైసీపీ ఎంపీలు ఆరుగురు వైసీపీ రాజ్యసభలో ఢిల్లీలో ఏం సాధించారని కూడా నిలదీశారు.మొత్తం తీరు చూస్తుంటే కేంద్ర పెద్దల వద్ద పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన లేనట్టు ఉందని సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్లు చేశారు.
జల వనరుల రంగానికి సంబంధించి కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో భారీగానే .నిధులు కొన్ని ప్రాజెక్టుల విషయంలో కేటాయించడం జరిగింది.దీన్ని బట్టి చూస్తే పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధులు రాబట్టుకోవడం లో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రధాన జీవనాడి ప్రాజెక్ట్ పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.సీఎం జగన్ ఢిల్లీ పర్యటన లో పోలవరం ప్రాజెక్టు గురించి… కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించానని చెబుతారు కానీ బడ్జెట్ లో చూస్తే ఎక్కడా కూడా కేటాయింపులు లేవు అంటూ పవన్ తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.