మరికొద్ది రోజుల్లోనే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు దగ్గర అయ్యేందుకు, వారి ఓట్లను తమ పార్టీకి పడేవిధంగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
అధికార పార్టీ వైసిపి గెలుపు ధీమాతో ఉండగా, ఆ పార్టీని ఏదో రకంగా ఓడించాలనే పట్టుదల టిడిపి, జనసేన, బిజెపిలలో కనిపిస్తున్నాయి.ఇప్పటికే జనసేన, టిడిపి పొత్తు పెట్టుకోగా, బిజెపి, జనసేన లు పొత్తు కొనసాగిస్తున్నాయి.
అయితే ఈ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటికే బీజేపీతో పొత్తు విషయమై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ) తో భేటీ అయ్యారు.
పొత్తు విషయంలో ఇంకా బీజేపీ నుంచి ఏ క్లారిటీ రాలేదు.కానీ ఖచ్చితంగా పొత్తు పెట్టుకునే దిశగానే బిజెపి అగ్రనేతలు ఉన్నారు.
దీంతో టిడిపి, జనసేన, బిజెపిలు కలిస్తే ఏపీలో కచ్చితంగా ఈ కూటమికి గెలుపు అవకాశాలు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది .

ఏపీలో ఈ మూడు పార్టీల పరిస్థితి పరిశీలిస్తే టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయ అనుభవం పై జనాల్లో సానుకూలత ఉండడం, అధికార పార్టీ వైసిపి తప్పిదాలు, రోడ్లు మరమ్మత్తులు చేయకపోవడం, మరికొన్ని ప్రజా సమస్యలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడం, ఇలా కొన్ని కొన్ని అంశాలపై టిడిపి చేస్తున్న పోరాటాలు ఆ పార్టీకి కలిసి వస్తాయి.అలాగే సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వం, రాజకీయ వ్యూహాలు ఈసారి ఎన్నికల్లో తప్పకుండా పనిచేస్తాయనే నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో బాగా కనిపిస్తోంది.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విషయానికొస్తే.
ఆయనకు ఉన్న సినీ గ్లామర్, కాపు సామాజిక వర్గం ఓట్లు, యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ ఇవన్నీ కలిసి వచ్చే అంశాలే.

టిడిపి , బిజెపి, జనసేన పొత్తు లో భాగంగా తమకు కేటాయించే సీట్లలో కచ్చితంగా ఈసారి గెలుస్తామనే నమ్మకం పవన్ లో కనిపిస్తోంది.అలాగే వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని పవన్ చేస్తున్న విమర్శలు ఈసారి కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది.బిజెపి విషయానికి వస్తే ఏపీలో ఆ పార్టీ ఉన్నా లేనట్టుగానే పరిస్థితి ఉంది, ఏపీలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ బిజెపి ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు.
అయితే ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) చరిష్మా, కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి రాబోతోందనే సంకేతాలు ఇవన్నీ కలిసివచ్చే అంశాలే.ఈ మూడు పార్టీలు కలిస్తే అధికార పార్టీ వైసీపీకి ఈసారి ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే అంచనాలు ఉన్నాయి.