ఉసిరికాయలు తింటే ఇన్ని లాభాలున్నాయి

Healthy Benefits Of Eating Amla

ఉసిరి చాలా ఆరోగ్యకరమైనది.ఆయిర్వేదంలో కూడా ఉసిరికి ఎంతో ప్రధాన్యతనిచ్చారు.

 Healthy Benefits Of Eating Amla-TeluguStop.com

ఇది మనదేశంలో బాగా దొరుకుతుంది.అందుకే ప్రాచీన కాలం నుంచి ఉసిరిని మెడికల్ సోర్స్ గా వాడుతున్నారు.

ఈ ఉసిరి వలన ఎన్నో లాభాలున్నాయి.కొన్ని ఇప్పుడు చూడండి.

* వంద గ్రాముల ఉసిరిలో 445 మిల్లిగ్రాముల విటమిన్ సి దొరుకుతుంది.ఇది మాత్రమే కాదు, ఉసిరిలో పోలిఫెనల్స్, గాల్లిక్ ఆసిడ్, ఎల్లాజిక్ ఆసిడ్, ఫ్లెవోనైడ్స్… ఇలా శరీరానికి కావాల్సిన ఎన్నో అవసరాలు దొరుకుతాయి.

* ఉసిరిలో యాంటిఆక్సిడెంట్స్ మంచి మోతాదులో దొరుకుతాయి.ఈ లక్షణం వల్లే రాడికల్స్‌ తో పోరాడగలుగుతుంది ఉసిరి.

* ఉసిరి బాగా తినే అలవాటు ఉన్నవారికి వయసు తొందరగా కనబడదని, లేటు వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

* ప్రోటీన్ మెటబాలిజంని సరైన ట్రాక్ లో పెట్టాలంటే ఉసిరి తినడం మంచి మార్గం.

తద్వారా బరువు కూడా పద్ధతిగా తగ్గొచ్చు.

* ఉసిరిలో యాంటిబ్యాక్టిరియల్ లక్షణాలు ఎక్కువగా లభిస్తాయి.

రెగ్యులర్ గా తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

* ఉసిరి దంతాలకు బలాన్నిస్తుందని పరిశోధకులు కొన్నేళ్ళుగా చెబుతూనే ఉన్నారు.

* పీరియడ్స్ లో ఉసిరి తినడం అమ్మాయిలకి ఎంతో మంచిది.పీరియడ్స్ లో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఉసిరి పనికివస్తుంది.

* ఉసిరి జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది.శరీరం ఎక్కువ న్యూట్రింట్స్ తీసుకునేలా చేస్తుంది ఉసిరి.

కాబట్టి తిన్న తిండి బాగా జీర్ణం అవుతుంది.

* ఉసిరి కురులకి మంచిదని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా.

మన ఇంట్లో అమ్మో, నానమ్మో ఉసిరి వెంట్రుకలకి బలాన్నిస్తుందని చెబుతుంటే చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నాం.కురులు షైనీగా, ఆరోగ్యంగా ఉండటానికి ఉసిరి ఉపయోగపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube