చంద్రుడిపై ఏముందో తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు అన్వేషణ చేస్తున్నాయి.ఇప్పటికే ఎందరో రాకెట్లను పంపి ప్రయోగాలు కూడా చేశారు.
కానీ, ఇప్పటివరకూ చంద్రుడిపై ఖచ్చితంగా ఏముంది అనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు.రాబోయే రోజుల్లో చంద్రుడిపై, ఆ తర్వాత అంగారకుడిపై ప్రజలు నివసించడమే లక్ష్యంగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగాలు చేస్తుంది.
ఇందులో భాగంగానే జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ.ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటాతో చేతులు కలిపింది.
చంద్రుడిపై ప్రయోగాల కోసం ఓ కారును సిద్ధం చేస్తోంది.దీనికి ‘లూనార్ క్రూయిజర్’ అని పేరు పెట్టారు.
ఈ టయోటా కారులో అన్ని సదుపాయాలు ఉండేలా దీన్ని తయారుచేస్తున్నారు.ఈ కారులో వెళ్లే వారు.సురక్షితంగా తినడం, పని చేయడం, ప్రశాంతంగా నిద్రపోవడంతో పాటు.ఇతరులతో కమ్యూనికేషన్ కూడా చేయగలరట.
రోదసీలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందన్న ఉద్దేశంతో ఈ ప్రయోగం చేపట్టారు.అంతేకాదు, రోదసిలో తనిఖీలు చేయడం, నిర్వహణ, పనులు చేసేందుకు ఈ కారుకి ఒక రోబోటిక్ హస్తాన్ని కూడా అమర్చనున్నారు.
గిటాయ్ జపాన్ అనే సంస్థ ఈ రోబోటిక్ హస్తాన్ని రూపొందించింది.దీనిపై తాజాగా గిటాయ్ సీఈవో షో నకానోస్ మాట్లాడారు.
ఒకప్పుడు రోదసీ మీదకు వెళ్లడం అంటేనే ఒక కలగా.ఒక సవాల్ గా ఉండేది.కానీ ఇప్పుడు మనం దాన్ని జయించాం.మనం రోదసీ ప్రయాణానికి వ్యోమగాములను వాడేవాళ్ళం.
అయితే, అంతరిక్షంలో యాక్టివ్ గా పనిచేయడం ఈ వ్యోమగాములకు కష్టతరంగా మారింది.అంతేకాక వ్యోమగాములకు ఖర్చు కూడా అధికంగా అయ్యేది.
ఈ సమస్యను తీర్చడానికి మేము.రోబోలను ఎంచుకున్నాం.
చంద్రుడిపై కాలు పెట్టి సరికొత్త అన్వేషణ సాగించాలని తయారవుతున్న లూనార్ కారు ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలని ఆయన తెలిపారు.