సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలి అంటే హీరోయిన్ల కన్నా అధికమొత్తంలో హీరోలకు రెమ్యూనరేషన్ చెల్లిస్తారు.ఇలా హీరోయిన్లు వారికున్న డిమాండ్ బట్టి వారికి పారితోషికం ఇవ్వడం అనేది జరుగుతుంది.
అయితే కరోనా మొదటి దశ తర్వాత ఎంతో మంది నిర్మాతలు చాలా నష్టాలను ఎదుర్కోవటం వల్ల హీరోలు వారి రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని ఎంతో మంది నిర్మాతలు కోరారు.అయితే ఈ విధానం తమిళ ఇండస్ట్రీలో అమలులోకి వచ్చిన తెలుగులో మాత్రం ఏ ఒక్క హీరో కూడా వారి రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు.
ఈ క్రమంలోనే ఈ రెమ్యూనరేషన్ విషయంపై నటి శృతిహాసన్ స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.కరోనా మొదటి దశ తర్వాత ఒక నిర్మాత తన వద్దకు వచ్చి కరోనా కారణం వల్ల అందరూ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నారు తను కూడా తగ్గించుకోవాలని అడిగారట.
అయితే ఆమె నటిస్తున్న ఆ సినిమాలో హీరో మాత్రం తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు.అందుకే హీరో రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే తాను కూడా రెమ్యునరేషన్ తగ్గించుకుంటాను అని శృతి హాసన్ చెప్పినట్లు వెల్లడించారు.
సాధారణంగా హీరోయిన్లతో పోలిస్తే హీరోలకు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తారు. హీరోకి చెల్లించిన రెమ్యూనరేషన్ చెల్లించమని అడగడం ఏ మాత్రం న్యాయం కాదు కనుక హీరో రెమ్యునరేషన్ తగ్గించు కోనపుడు హీరోయిన్ ను రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం సబబు కాదని శృతిహాసన్ రెమ్యునరేషన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు.అయితే ఆ నిర్మాత ఎవరు? హీరో ఎవరు? అనే విషయాలను మాత్రం బయటపెట్టలేదు.ఇక సినిమాల విషయానికి వస్తే శృతిహాసన్ ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు.
అదేవిధంగా ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తున్నారు.