జాండీస్.దీనిని కామెర్లు అని పిలుస్తారు.లివర్‌కు సంబంధించిన వ్యాధి ఇది.జాండీస్ సోకిన వారు నీరసం, అలసట, దురదలు, జ్వరం, పొట్టలో నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అలాగే మూత్రం రంగు మారడం, చర్మం కళ్లు పచ్చగా మారడం వంటివి కూడా జరుగుతుంటాయి.ఏదేమైనప్పటికీ సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే వ్యాధి మరింత ముదిరి పోయి లివర్ తీవ్రంగా దెబ్బతింటుంది.
అయితే జాండీస్ కు గురైనప్పుడు వైద్యులు సూచించిన మందులతో పాటు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని కొన్ని పానియాలు కూడా ఉన్నాయి.మరి ఆ పానియాలు ఏంటో.? ఎందుకు వాటిని తీసుకోవాలో.? ఇప్పుడు తెలుసుకుందాం.
చెరుకు రసం.అద్భుతమైన రుచిని కలిగి ఉండడమే కాదు జాండీస్ వ్యాధిని నివారించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.చెరుకు రసంను తాగడం వల్ల.అందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు కామెర్ల వ్యాధిని నివారించి లివర్‌ను ఆరోగ్యవంతంగా మారుస్తాయి.
తులసి టీ..జాండీస్ కి గురైన వారు ప్రతి రోజూ ఉదయాన్నే ఒక కప్పు దీనిని తప్పకుండా సేవించాలి.తద్వారా అందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కామెర్లను త్వరగా తగ్గిస్తాయి.
అలాగే రెగ్యులర్‌గా ఒక గ్లాస్ బార్లీ వాటర్ తాగడం వల్ల జాండీస్ తగ్గడమే కాదు దాని లక్షణాల నుంచి సైతం విముక్తి లభిస్తుంది.
లెమన్ జ్యూస్.
లివర్‌ను క్లీన్ చేసే సామర్థ్యం దీనికి ఉంది.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో రెండు లేదా మూడు స్పూన్ల లెమన్ జ్యూస్ కలిపి ఉదయాన్నే తాగితే.
లివర్ సూపర్‌గా డిటాక్స్ అయ్యి జాండీస్ త్వరగా తగ్గు ముఖం పడుతుంది.
ఇక ఇవే కాకుండా బొప్పాయి ఆకుల రసం, ఉసిరి రసం, టమోటో జ్యూస్, పాలకూర జ్యూస్, ముల్లంగి రసం వంటివి కూడా జాండీస్‌ను త్వరగా తగ్గించడానికి వేరే లెవల్‌లో సహాయపడతాయి.కాబట్టి, ఎప్పుడైనా కామెర్లకు గురైతే ఈ సూపర్ డ్రింక్స్‌ను తీసుకోవడం మాత్రం మరచిపోకండి.