సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహకందని విధంగా ఉంటుంది.కాస్త దశ తిరిగింది అంటే చాలు అప్పటి వరకు సాదాసీదా నటులుగా ఉన్న వారు ఒక్కసారిగా స్టార్లుగా మారిపోతుంటారు.
అదే సమయంలో స్టార్లుగా కొనసాగుతున్న వారు అదృష్టం కలిసి రాక కనిపించకుండా పోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది.ఇకపోతే ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో బుల్లితెరపై నటునిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెండితెరను ఏలుతున్న సార్లు ఎంతోమంది ఉన్నారు.అలాంటి వారు ఎవరో తెలుసుకుందాం.
నయనతార
: ప్రస్తుతం దక్షిణాది ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గానే కొనసాగుతోంది.అంతేకాదు సీనియర్ హీరోయిన్ అని ముద్ర పడినప్పటికీ ఇప్పటికీ అందరికంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా కొనసాగుతుంది నయనతార.అయితే ఈ లేడీ సూపర్ స్టార్ కెరియర్ బుల్లితెర పైనే మొదలయింది.
మలయాళ టెలివిజన్ షో కి నయనతార యాంకర్ గా పనిచేసింది.ఇక ఆ తర్వాత మన సింగారి అనే సినిమాలో అవకాశం రావడంతో ఇక నటిగా వెండితెరపై అడుగు పెట్టిన నయనతార ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది.ఇప్పడు లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది.
ప్రకాష్ రాజ్
: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న ప్రకాష్రాజ్ కెరియర్ కూడా అటు బుల్లితెరపైనే ప్రారంభమైంది.అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారమయ్యే కన్నడ సీరియల్స్ లో నటించే వాడు ప్రకాష్ రాజు.1988లో సినిమా ఆఫర్ రావడంతో ఇక అక్కడి నుంచి ప్రకాష్రాజ్ కెరీర్ మొత్తం కీలక మలుపు తిరిగింది.
హన్సిక : దేశముదురు సినిమాతో హీరోయిన్ గా మారి మొదటి సినిమాతోనే యూత్ అందరినీ ఆకర్షించింది హన్సిక.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రోజుల పాటు హీరోయిన్గా రాణించిన హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ బుల్లితెరపై మొదలు పెట్టిందట.
షకలక బూమ్ బూమ్ అనే సీరియల్ లో నటించింది హన్సిక.ఆ తర్వాత సినిమాల్లో కూడా రాణించింది.
యష్ :
కే జి ఎఫ్ సినిమా తో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక్కసారి గా గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో యష్.అయితే ఇప్పుడు క్రేజీ హీరోగా మారిపోయిన యష్ కెరియర్ కూడా బుల్లితెర పైనే ప్రారంభమైంది.ఎన్నో సీరియల్స్ లో నటించిన యష్ 2007లో ఓ సినిమాలో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఇప్పుడు యష్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మాధవన్ :
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన సినిమాతో ప్రేక్షకులను ఆకర్షించి లవర్బాయ్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు.అయితే సినిమాల్లోకి రాకముందు మాధవన్ హిందీ సీరియల్స్ లో నటించారట.తర్వాత తమిళ తెలుగు సినిమాల్లో రాణించిన మాధవన్ ఇక ఇప్పుడు హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఉండడం గమనార్హం.
సాయి పల్లవి : ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ తన గొప్ప నటనతో మెప్పించే హీరోయిన్ గా కొనసాగుతుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.ఈ అమ్మడి కెరియర్ కూడా బుల్లితెర పైన ప్రారంభమైంది.ఒక రియాలిటీ షోలో డాన్స్ కంటెస్టెంట్ గా చేసింది సాయి పల్లవి.
ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది.సాయి పల్లవి :
విజయ్ సేతుపతి: ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నారు.అయితే సన్ టీవీలో ప్రసారమయ్యే తమిళ సీరియల్ లో తన కెరీర్ ని ప్రారంభించారు.వెండితెరపై ఎన్నో చిన్న పాత్రలు చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విజయ్ సేతుపతి ఇక ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు.
శివ కార్తికేయన్ : ఇటీవలి కాలంలో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయాలను అందుకుంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు శివకార్తికేయన్.శివకార్తికేయన్ కెరియర్ ఒక స్టాండప్ కమెడియన్గా బుల్లితెర పైన ప్రారంభమైందని చాలామందికి తెలియదు.
ఎన్నో రోజుల పాటు బుల్లితెర పై స్టాండప్ కమెడియన్ గా అలరించిన శివ కార్తికేయన్ 2012లో ఓ తమిళ సినిమాతో హీరోగా అవకాశం దక్కించుకునీ.ఇప్పుడు బాగా రాణిస్తున్నాడు.