ఎండుద్రాక్ష(కిస్మిస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు.ఎండుద్రాక్షలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సహా అనేక పోషకాలు ఉన్నాయి.
అలాగే చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి.అవి ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తాయి.
ఈ ఎండుద్రాక్షను ప్రత్యేక పద్ధతిలో తింటే ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా ఉంటాయి.ఏ విధంగానైనా ఎండుద్రాక్ష తినవచ్చు.
అయితే నానబెట్టిన ఎండుద్రాక్షను తింటే, అవి మీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.ఇందుకోసం ఎండు ద్రాక్షను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
ఎండుద్రాక్షను నానబెట్టడం వల్ల దాని పోషక విలువలు పెరుగుతాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది.ఎండుద్రాక్షలు నానబెట్టిన నీటిని తాగమని కూడా నిపుణులు చెబుతుంటారు.
ఎందుకంటే అనేక పోషకాలు ఆ నీటిలోకి చేరతాయి.అవి మీ శరీరానికి మరింత ప్రయోజనం చేకూరుస్తుంది.ఎండుద్రాక్షలో చక్కెర ఉంటుంది.ఇది శరీరంలో చక్కెర లోటును తీరుస్తుంది.
ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు.ఫలితంగా బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది.
అదనంగా వీటిలో ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి.ఎండుద్రాక్షలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.
వీటిని నీటిలో నానబెట్టడం వల్ల అవి లాక్సిటివ్లుగా పనిచేస్తాయి.పొట్టను శుభ్రపరచడంలో సహాయపడతాయి.
ఫలితంగా మలబద్ధకం సమస్యను తొలగిపోతుంది.