ట్విట్టర్ ట్రెండింగ్ లు చూసి మురిసిపోతున్న టీఆర్ఎస్.. కానీ..

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ లో తమ పార్టీ గురించి ట్రెండ్ అయితే చూస్తూ మురిసిపోతుంది.కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయని ఏ ఒక్క నాయకుడు కూడా సరిగా పట్టించుకోవడం లేదట.

 Trs Is Getting Tired Of Seeing Twitter Trends  But,   Trs, Kcr, Ktr-TeluguStop.com

దీనిపై టీఆర్ఎస్ క్యాడర్ నేతలు చాలా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.కేవలం ట్విట్టర్ ట్రెండింగ్ ల ను మాత్రమే పట్టించుకుంటే అపార నష్టం వాటిల్లుతుందని చాలా మంది టీఆర్ఎస్ కు చెబుతున్నారు.

అయినా కానీ టీఆర్ఎస్ పార్టీ తీరు మారడం లేదని కొందరు అంటున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.

మొన్నటికి మొన్న తెలంగాణలో రైతులకు రైతు బంధు డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ సందర్భంలో రైతు బంధు గురించి ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచిందని చెప్పారు.

ఆ తర్వాత చాలా మంది రైతులు తమకు రైతు బంధు డబ్బులు అందలేదని ఫిర్యాదు చేశారు.స్వయానా వ్యవసాయ మంత్రి కూడా అందరికీ రైతు బంధు డబ్బులు రాలేదని, త్వరలో వేస్తామని ప్రకటించారు.

ఇక ఇప్పుడు కూడా టీఆర్ఎస్ నేతలు ట్విట్టర్ ట్రెండింగ్ లను చూసి  మరోసారి మురిసిపోతున్నారు.ఇటీవల టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విట్టర్ లో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు.

ఈ సెషన్ కు స్పందన మంచిగానే వచ్చింది.ఇది చూసిన టీఆర్ఎస్ నాయకులు తమ నేత ట్విట్టర్ లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించినంత సేపు ట్విట్టర్ ట్రెండింగ్ లో ఆస్క్ కేటీఆర్ నిలిచిందని అంటున్నారు.

ఇటా ట్విట్టర్ ట్రెండింగ్ లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే అంతా బాగున్నట్లు కాదని, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు పోవాలని పలువురు విశ్లేషకులు టీఆర్ఎస్ కు సూచిస్తున్నారు.

TRS Is Getting Tired Of Seeing Twitter Trends But, TRS, Kcr, Ktr -

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube