సుకుమార్ బర్త్ డే.. దేవి శ్రీ ప్రసాద్ సూపర్ గిఫ్ట్?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఆర్య సినిమా నుంచి మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్పాలి.

 Devi Sri Prasad Special Birthday Wishes To Director Sukumar, Director Sukumar,d-TeluguStop.com

సుకుమార్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతో మంచి విషయాలను అందుకున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారని చెప్పాలి.ఇకపోతే నేడు (జనవరి 11) డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు కావడంతో దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో తనకు బర్త్ డే కానుకను అందించారు.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాలోని “చూపే బంగారమాయనే శ్రీవల్లీ” అనే పాటకు పేరడీగా బర్త్‌డే సాంగ్‌ క్రియేట్ చేసి సుకుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ విషయం తెలిసిన ఎంతో మంది నెటిజన్లు డైరెక్టర్ సుకుమార్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube