ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది.అది నిజమేనా లేకపోతే ఫేక్ వీడియోనా అని అనుమానం కూడా కలుగుతుంది.
కాగా ఇలాంటి వీడియోలకు విపరీతంగా వ్యూస్ కూడా వస్తుంటాయి.అయితే ఇలాంటి వాటిలో సాయం చేయడానికి సంబంధించినవి కూడా బాగానే ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే.దివ్యాంగులకు సాయం చేసే వీడియోలకు బాగానే వ్యూస్ వస్తుంటాయి.
అయితే ఇప్పుడు కూడా ఇలాంటి సాయానికి సంబంధిచిన వీడియో బాగా ట్రెండ్ అవుతోంది.
అయితే దీన్ని చూస్తే అందరూ ఆశ్చర్య పోతారు.
ఎందుకంటే ఇందులో ఓ కుర్రాడికి దుప్పటి ఇవ్వగానే అప్పటి వరకు వీల్ చైర్ లో ఉన్న అతగాడు అమాంతం నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు.అదేంటి అని అంతా షాక్ అవుతున్నారు.
ఎందుకంటే అతను అప్పటి వరకు దివ్యాంగుడిగా వీల్ చైర్ లో కూర్చుని సడెన్ గా ఎలా వెళ్తాడని అందరూ కామెంట్లు పెడుతున్నారు.కాగా ఇప్పుడు చలికాలం కాబట్టి ట్రస్టులలో దివ్యాంగులకు దుప్పట్లు పంచడం కామన్ కదా.
అయితే ఇప్పుడు కూడా ఓ ట్రస్టులో ఇలాగే డిజిటల్ లిటరసీ మిషన్ లో భాగంగా దుప్పట్లు పంపినీ చేశారు.
కాగా వీల్ చైర్ లో ఉన్న ఓ చిన్నారికి దుప్పట్లు ఇచ్చాడు.కాగా ఆ చిన్నారి దుప్పట్లు ఇచ్చింనందుకు థాంక్స్ చెప్పాడు.అయితే ఇలా మాట్లాడుతూనే ఆ పిల్లాడు సడెన్ గా ఆ వీల్ చైర్ లో నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
దీంతో అందరూ షాక్ అయిపోయారు.ఎందుకంటే అతను దివ్యాంగుడు అలా ఎలా వెళ్లాడు అని.ఇదిచూసిన చాలామంది అది ఆలీబాబా దుప్పటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఆ కుర్రాడికి పూర్తిగా అంగవైకల్యం లేదు.
నడవడానికి అతనికి వీలుంది.కాగా ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.