కాంగ్రెస్ లో మొదలైన ఎన్నికల వేడి...టార్గెట్ ఫిక్స్ అయినట్టేనా?

ప్రస్తుతం తెలంగాణలో అనాధికారికంగా ఎన్నికల వేడి మొదలైందని చెప్పుకోవచ్చు.ఇప్పటికే తెలంగాణలో ఉన్న మెజారిటీ పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుండే సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

 The Election Heat That Started In The Congress ... Is It A Target Fix Telangana-TeluguStop.com

టీఆర్ఎస్ పార్టీని వెనక్కి నెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తమ కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితి ఉంది.ఇక కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు.

ఎవరు అసెంబ్లీకి పోటీ చేయాలి, ఎవరు లోక్ సభకు పోటీ చేయాలి అనే విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ నాయకుల మధ్య చిన్నపాటి చర్చ అయితే మొదలైన పరిస్థితి ఉంది.

గత ఎన్నికలో లోక్ సభకు పోటీ చేసిన వారు ప్రస్తుతం లోక్ సభకు పోటీ చేసేందుకు ఆసక్తిగా లేనటువంటి పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పటి వరకు లోక్ సభకు పోటీ చేసిన నేతలు ప్రస్తుతం శాసన సభకు పోటీ చేయాలని సన్నద్దమవుతుండటంతో అక్కడ పోటీ చేసేందుకు నేతలు లేక కాంగ్రెస్ సరికొత్త ఇక్కట్లు ఎదురవుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ  ఖచ్చితంగా విజయం సాధిస్తామనే నియోజకవర్గాల విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ లో అంతర్గతంగా క్షేత్ర స్థాయిలో కార్యాచరణ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వచ్చే ఎన్నికల్లో మాత్రం గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలని ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలని చూస్తున్న పరిస్థితి ఉంది.కాంగ్రెస్ లో ఆశావాదులు ఎక్కువగా ఉన్నప్పటికీ రెబల్ అభ్యర్థుల వైఖరి ఎలా ఉంటుందనేది మరో ఆసక్తికర విషయం.ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ స్థానాల్లో గెలుపొందితేనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా ఉండే అవకాశం ఉంది.

లేకపోతే మరల మూడో స్థానానికి పడిపోవాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube