పుర్రెకో బుద్ధి,జిహ్వాకో రుచి అన్న మాట ఊరికనే పుట్టలేదు కదండి.ఎందుకంటే ఇలాంటి మనుషులు ఇప్పుడు చాలామంది పుట్టుకొస్తున్నారు.
కాలం మారుతోంది.కాలంతో పాటు జనాలలో ఆలోచనలు, అంచనాలు మారుతున్నాయి.
ముఖ్యంగా తినే ఆహారంలో అనేక రకాల మార్పులు వచ్చాయి.ఎన్నో కొత్త కొత్త వంటకాలు పుట్టుకొచ్చాయి.
గత చరిత్రలో ఎన్నడూ లేనన్ని వింత వంటకాలను కూడా మనం చూస్తున్నాం.వస్తువుల్లో ఎలాగైతే మార్పులు వస్తున్నాయో వంటకాల్లో కూడా అలాగే మార్పులు వస్తున్నాయి.
మనకు సాధారణంగా తెలిసిన వంటకాలను అలాగే చేయకుండా ఇంకొంచెం డిఫరెంట్ గా తయారు చేసి చిత్ర విచిత్రాలకు తెర తీస్తున్నారు చాలామంది.ఇలాంటి వంటకాలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇప్పుడు కూడా ఇలాంటి వైరల్ వీడియో గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.ఇందులో ఓ వ్యక్తి గులాబ్ జామ్ సమోసాను ట్రై చేశాడు.
వినడానికే ఆశ్చర్యకరంగా ఉంది కదూ.కానీ ఇదే నిజమండి బాబు.ఓ వ్యక్తి ఎందుకో గులాబ్ జామ్ సమోసాను ఆర్డర్ చేశాడు.ఫస్ట్ టైమ్ దాన్ని రుచి చూడాలనుకున్నాడు.
వాస్తవానికి ఆ వంటకం ఆ ప్లేస్ లో బాగానే అమ్ముడు పోతోంది.అందరూ తినే సరికి అతనికి కూడా తినాలనిపించింది.వెంటనే అతను కూడా ఆర్డర్ చేసుకున్నాడు.ఇంకేముంది పార్సిల్ లో వచ్చిన ఆ గులాబ్ జామ్‌ను ఓపెన్ చేసి నోట్లో వేసుకున్నాడు.దాంతో ఇదేం టేస్టు రా నాయనా అన్నట్టు ఎక్స్ ప్రెషన్ పెట్టేశాడు.అదేదో తినకూడని వంటకాన్ని తిన్నట్టు ముఖ కవలికలు పెట్టే సరికి ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.
ఏంటి బ్రో ఎలా ఉంది టేస్టు అంటూ ఫన్నీగా అడుగుతున్నారు.ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.