టీమ్ ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్‌లో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అనేక మ్యాచ్‌ల్లో సిక్సర్లతో చెలరేగిపోయి చరిత్రలోనే గొప్ప క్రికెటర్లలో ఒకరిగా యువరాజ్ సింగ్ పేరు తెచ్చుకున్నాడు.
అయితే తాజాగా అతడు మరో అరుదైన ఘనత సాధించాడు.యువరాజ్ సింగ్ తన తొలి సెంచరీ సాధించడానికి ఉపయోగించిన ఒక బ్యాట్‌ను ఎన్ఎఫ్టీ మార్కెట్ కలెక్షన్ సంస్థ తాజాగా అంతరిక్షంలోకి పంపించింది.
దీనితో స్పేస్‌లోకి వెళ్లిన తొలి బ్యాట్‌గా యువరాజ్ సింగ్ బ్యాట్ చరిత్ర సృష్టించింది.
ఆసియాకు చెందిన ఒక ఎన్ఎఫ్టీ (NFT) మార్కెట్ కలెక్షన్ సంస్థ ఎన్ఎఫ్టీలను జారీ చేయడానికి యువరాజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
దీనివల్ల యువరాజ్ సింగ్ కు సంబంధించిన ఎన్ఎఫ్టీలను అభిమానులకు అమ్మే అవకాశం ఉంది.యువరాజ్ సింగ్ మాటలను, క్రికెట్ ట్రోఫీలు, బ్యాట్, గ్లోవ్స్, ఇలా అతనికి సంబంధించిన అన్నిటిని డిజిటలైజ్ చేసి అభిమానులకు అమ్మడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అంతరిక్షంలోకి పంపించిన బ్యాట్‌పై కొన్ని టెక్నికల్ డివైజులను కూడా అమర్చారు.ఈ పరికరాల సహాయంతో యువరాజ్ సింగ్ వాడిన హీరో హోండా బ్యాట్ అంతరిక్షంలో ఎగురుతున్నట్లు చూడటం సాధ్యపడుతుంది.దీనికి సంబంధించిన వీడియోను ఎన్ఎఫ్టీ సంస్థ ట్విట్టర్ వేదికగా పంచుకుంది.దీన్ని చూసిన క్రికెట్ ప్రియులు, యువరాజ్ సింగ్ అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
వైరల్ అయిన వీడియోలో యువరాజ్ సింగ్ బ్యాట్‌ను కొందరు వ్యక్తులు స్పేస్‌లోకి పంపిస్తున్నట్లు చూడొచ్చు.ఆ తర్వాత అది అంతరిక్షంలో తేలియాడుతున్నట్లు కూడా గమనించవచ్చు.2003వ సంవత్సరం లోనే యువరాజ్ సింగ్ తన మొదటి సెంచరీ సాధించాడు.ఢాకా వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 85 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాది సెంచరీ సాధించాడు యువరాజ్.అయితే ఏ బ్యాట్‌తో సెంచరీ సాధించాడో ఆ బ్యాట్‌ను ఇప్పుడు స్పేస్‌లోకి పంపించింది ఎన్ఎఫ్టీ మార్కెట్ కలెక్షన్ సంస్థ.