ఇటీవల రోజుల్లో పౌష్టికాహార లోపానికి గురవుతున్న పిల్లల సంఖ్య భారీగా పెరుగుతోంది.పోషకాహార లోపం వల్ల పిల్లల రోగ నిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుంది.
దాంతో తరచూ వారు జబ్బుల బారిన పడుతుంటారు.అందుకే పిల్లల్లో ఏర్పిడిన పోషకాహార లోపాన్ని తల్లిదండ్రులు త్వరగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
లేదంటే పిల్లల ఆరోగ్యానికి ముప్పు క్రమ క్రమంగా పెరిగిపోతుంది.మరి ఇంతకీ పిల్లల్లో పోషకాహార లోపాన్ని ఎలా గుర్తించాలి.? అసలు పిల్లల్లో పోషకాలు లోపిస్తే ఏయే లక్షణాలు కనిపిస్తాయి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాహార లోపానికి గురైన పిల్లలు ఎప్పుడూ నీరసంగా, బలహీనంగా ఉంటారు.వారిలో ఆందోళన, అలసట వంటివి ఎక్కువగా కనిపిస్తాయి.ఆకలి అస్సలు ఉండదు.ఎంత రుచికరమైన ఫుడ్‌ను పెట్టినా తినడానికి ఇష్టపడరు.
చదవులపైనే కాదు మరే విషయాలపైనా శ్రద్ధ చూపలేకపోతుంటారు.అలాగే పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడితే.వారి చర్మం పొడిగా మరియు గరుకుగా మారుతుంది.జుట్టు కూడా బాగా ఊడిపోతుంటుంది.
తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి జబ్బుల బారిన పడుతుంటారు.ఎముకలు, కండరాల నొప్పులకు గురవుతుంటారు.మరియు వారి శరీర బరువు ఉన్నట్లుండి బాగా తగ్గి పోవడం లేదా పెరిగిపోవడం జరుగుతుంది.ఇటువంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే.వారిలో పోషకాహార లోపాన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అందు కోసం ముఖ్యంగా వారి డైట్‌లో పాలు, పాల పదార్థాలు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, తాజాగా పండ్లు, బాదం పప్పు, జీడిపప్పు, ఖర్జూరం, వాల్ నట్స్, అన్ని కూరగాయలతో తయారు చేసిన కిచిడి, పప్పు ధాన్యాలు, అవిసె గింజలు వంటి ఆహారాలను చేర్చాలి.
అదే సమయంలో ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, వైట్ బ్రెడ్, ఐస్ క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ వంటి ఆహారాలను పిల్లలకు దూరంగా ఉంచాలి.