తెరవెనుక ఎన్టీఆర్ కష్టం చూస్తే ఎవరైనా సరే గ్రేట్ అనకుండా ఉండలేరు.. ఈ సీన్స్ చాలు?

దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా RRR.రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత ఎన్నో అంచనాల నడుమ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 If You See The Jr Ntr Hard Work Behind Every Scene Of Rrr Movie Details, Rrr, J-TeluguStop.com

రాజమౌళి సినిమా అంటే ప్రతి ఒక్కరు భారీ అంచనాలను పెట్టుకొని ఉంటారు.సాధారణంగా రాజమౌళి సినిమాలో ఒక హీరో నటిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది.

అలాంటిది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి మెగా కుటుంబం నుంచి ఒక హీరో నందమూరి కుటుంబం నుంచి మరో హీరో కలిసి నటిస్తే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రతి రోజు రాజమౌళి సినిమాకు సంబంధించి ఏదో ఒక విషయాన్ని బయట పెడుతూనే ఉన్నారు.

తాజాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించడానికి ఏ విధంగా కష్టపడ్డారు అంటూ ఎన్టీఆర్ మేకోవర్ వీడియోను విడుదల చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియాలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించడం కోసం అడవులలో పరిగెత్తడం, బైక్ స్టంట్, కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం ఎలా కష్టపడ్డారు అనే విషయాలు చూడవచ్చు.ఎన్టీఆర్ తరహాలోనే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించి మరొక మేకోవర్ వీడియో విడుదల చేశారు.ఇలా ఇద్దరు హీరోల మేకోవర్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే ఎన్టీఆర్ ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురంభీం పాత్రలో కనిపించ గా రామ్ చరణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.

ఇలా విభిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి ఇద్దరు ఎలా కలుస్తారు? వీరిద్దరూ కలిసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎలా ఎదిరించారు అనే ఒక ఫిక్షనల్ పీరియడ్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్టీఆర్ మేకోవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన వీడియోలు పాటలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రెస్ మీట్ నిర్వహించారు.అదే విధంగా ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube