ఫ్యాన్స్ ను అప్సెట్ చేస్తున్న పుష్ప టీమ్..!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు.పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ ఇంకా వారం రోజులే ఉన్నా సరే ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు.

 Pushpa Team Upset With Promotions , Allu Arjun, Iconstar Allu Arjun, Latest Movv-TeluguStop.com

ప్రీ రిలీజ్ ఈవెంట్ 13న అని ఎనౌన్స్ చేశారు.ఇక రిలీజ్ ఈవెంట్ నుండి ప్రమోషన్స్ ఏమైనా ఊపందుకునే అవకాశం ఉంది.

ఎప్పుడో 2022 జనవరి 7న రిలీజ్ అవుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం రాజమౌళి ప్రమోషన్ ప్లాన్స్ ఓ రేంజ్ లో చేస్తుంటే పాన్ ఇండియాగా వస్తున్న పుష్ప ఎందుకు ప్రమోషన్స్ లో వెనకపడ్డాడు అని బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

పుష్ప పార్ట్ 1 ట్రైలర్, సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచగా ఈ సినిమాను అదే రేంజ్ లో ప్రమోట్ చేస్తే మాత్రం రికార్డులు కొట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

అయితే చిత్రయూనిట్ ఎందుకో ప్రమోషన్స్ విషయంలో కొద్దిగా వెనకబడుతున్నారని టాక్.మొత్తానికి పుష్ప కోసం ఫ్యాన్స్ అంచనాలు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సమంత ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube