'పుష్ప' కోరుకుంటున్న ఆ అద్బుత రికార్డ్‌ సాధ్యమేనా?

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను నేడు విడుదల చేయబోతున్నారు.

 Pushpa Trailer Day Fans Want Big Record Details, Pushpa Trailer , Record Views,-TeluguStop.com

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు ఈ సినిమా సాధిస్తుంది అనే నమ్మకంతో ప్రతి ఒక్కరు ఉన్నారు.సినిమాకు సంబంధించినంత వరకు ప్రతి ఒక్క విషయం లో కూడా పాన్ ఇండియా రేంజ్ ను చూపిస్తున్నారు.

ఇక నేడు విడుదల కాబోతున్న సినిమా ట్రైలర్ ను కూడా పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్‌ చేసేందుకు అభిమానులు సిద్దంగా ఉన్నారు.పుష్ప ఆల్‌ టైమ్ రికార్డను నమోదు చేసేందుకు అల్లు అర్జున్‌ అభిమానులు సిద్దంగా ఉన్నారు.

మొదటి పది నిమిషాల రికార్డు నుండి మొదలుకుని 24 గంటల వరకు ఎన్ని వ్యూస్ వచ్చాయి అనే రికార్డు వరకు అన్ని విషయాలను లెక్కించబోతున్నారు.లైక్స్.

కామెంట్స్.వ్యూస్.

ఇతర భాషల్లో వ్యూస్‌.డిజిటల్‌ వ్యూస్‌.

ట్వీట్స్ ఇలా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుని ట్రెండ్‌ చేయబోతున్నారు.

ప్రతి ఒక్క రికార్డును నమోదు చేసేందుకు ఇప్పటికే అభిమానులకు సూచనలు వెళ్లాయి.

ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు.బన్నీ లుక్ మరియు రష్మిక లుక్‌ ఇంకా ఇటీవల వచ్చిన ఆకట్టుకునే విధంగా ఉండటం వల్ల ట్రైలర్ కే ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి.

సినిమా విడుదల సమయంలో ఏ స్థాయిలో ఉంటుందో అర్థం అవ్వడం లేదు.

Telugu Allu Arjun, Anasuya, Fahadh Faasil, Pan India Range, Pushpa, Pushpa Trail

డిసెంబర్‌ 17న విడుదల చేయబోతున్న ఈ సినిమా కు సంబంధించిన అన్ని విషయాలు కూడా చాలా ఆసక్తిగా కొనసాగుతున్నాయి.పాన్ ఇండియా స్థాయి లో సౌత్‌ లో అన్ని భాషలు మరియు నార్త్‌ లో హిందీ లో విడుదల అవ్వబోతుంది.రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా లో సునీత్‌ మరియు అనసూయలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube