టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.ఆయన అల వైకుంఠపురములో సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చెయ్యాలి కానీ ఆ సినిమాను హోల్డ్ లో పెట్టారు.ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మరొక సినిమాను ప్రకటించారు.
అల వైకుంఠపురములో సినిమా వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు మరొక సినిమా స్టార్ట్ చెయ్యలేదు.
కానీ త్రివిక్రమ్ ప్రెసెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తూ బిజీగా ఉన్నాడు.అందుకే మహేష్ సినిమాను భీమ్లా నాయక్ సినిమా పూర్తి అయినా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్.ఇక మరోపక్క మహేష్ కూడా సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఇక త్రివిక్రమ్, పవన్ మంచి స్నేహితులని అందరికి తెలుసు.
వీరిద్దరూ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.
రెండు సూపర్ హిట్ అవగా.మరొక సినిమా ప్లాప్ అయ్యింది.
ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి భీమ్లా నాయక్ కోసం వర్క్ చేస్తున్నారు.వీరిద్దరి కాంబోలో వస్తున్నా ఈ సినిమా ఎలా ఉండబోతుందో నని అభిమానులంతా ఎదురు చేస్తున్నారు.
ఈ సినిమా డైరెక్టర్ సాగర్ కె చంద్ర అయినా కూడా త్రివిక్రమ్ నే అన్ని పనులు దగ్గరుండి చేసుకుంటున్నాడని తెలుస్తుంది.
అయితే ఇందుకు కారణం కూడా ఉంది.
పవన్ ఒక కారణం అయితే నిర్మాతలు మరొక కారణం అని తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమాను నిర్మించే హాసిని అండ్ హారిక క్రియేషన్స్- సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థల అధినేత రాధాకృష్ణ త్రివిక్రమ్ కు మంచి స్నేహితుడు.
అందుకే భీమ్లా నాయక్ సినిమాలో త్రివిక్రమ్ భాగం అయినట్టు తెలుస్తుంది.అసలు భీమ్లా నాయక్ సినిమా తీయడానికి కారణమే త్రివిక్రమ్ అట.
అంతేకాదు పవన్ కళ్యాణ్ ను ఈ ప్రాజెక్ట్ లోకి టీయూస్కు వచ్చింది కూడా త్రివిక్రమ్ అని తెలుస్తుంది.ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా వాటాల్లో లాభాలు కూడా తీసుకుంటున్నాడట.మొత్తం కలిపి దాదాపు 15 కోట్ల వరకు అందుకుంటున్నాడట త్రివిక్రమ్.ఇక త్రివిక్రమ్ వచ్చిన తర్వాత ఈ సినిమా మార్కెట్ కూడా అమాంతం పెరగడంతో త్రివిక్రమ్ ఇంత తీసుకోవడంలో తప్పు లేదు అంటున్నారు విశ్లేషకులు.