తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ ఛానల్ లో ప్రతి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో లో వివిధ రకాల గెటప్పులు, హిలేరియస్ పంచులు వంటి వాటితో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేది వంటి ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే గెటప్ శ్రీను ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో గెటప్ లు వేస్తూ బుల్లితెర కమలహాసన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఒక రకంగా చెప్పాలంటే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో గెటప్ శ్రీను పడిన కష్టాలు జబర్దస్త్ షో లో అవకాశం వచ్చిన తర్వాత పూర్తిగా తొలగిపోయాయి.
దీంతో ప్రస్తుతం గెటప్ శ్రీను సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు మరియు హోదాని దక్కించుకున్నాడు.అయితే ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన వైవాహిక జీవితం మరియు తన భార్య సుజాత గురించి పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా తనకి సినిమా అవకాశాలు లేని సమయంలో తన భార్య సుజాత ఎంతో అండగా నిలిచిందని చెప్పుకొచ్చాడు.అలాగే తన పెళ్లి కాకముందు తన భార్య సుజాత ని చెన్నై లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి తీసుకెళ్లానని అయితే ఆ ఇంటర్వ్యూలో తన భార్యకి ఉద్యోగం వచ్చిందని కానీ తనని విడిచిపెట్టి ఉండలేక ఉద్యోగం రాలేదని అబద్ధం చెప్పిందని అంతగా తన భార్య తనని ప్రేమిస్తుందని గెటప్ శ్రీను ఎమోషనల్ అయ్యాడు.
అలాగే తమ పెళ్ళి జరిగినప్పుడు తనకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు లేవని కానీ తన భార్య ఇచ్చిన ప్రోత్సాహం మరియు ధైర్యంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించి ప్రస్తుతం మంచి హోదాలో ఉన్నానని తెలిపాడు.

అంతేకాకుండా కెరీర్ కోసం మనం పడేటువంటి కష్టాన్ని అర్థం చేసుకుని అండగా నిలిచే లైఫ్ పార్టనర్ దొరికితే కచ్చితంగా మంచి స్థాయికి వెళతారని తన విషయంలో కూడా అదే జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇక తన స్నేహితులు ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుదీర్ తదితరులు కూడా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో చాలా కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారని కానీ కష్టపడి పని చేస్తే ఎప్పుడూ కూడా మంచి ఫలితాలు ఉంటాయని అందుకు తమ జీవితాలే మంచి ఉదాహరణ అని తెలిపాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం గెటప్ శ్రీను ఒకపక్క ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం లో కమెడియన్ గా పని చేస్తూనే మరోపక్క పలు తెలుగు చిత్రాలలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.
అలాగే ఓ టాలీవుడ్ నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న రాజు యాదవ్ అనే చిత్రంలో కూడా హీరోగా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.