లేటెస్ట్ సర్వే: టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో అతడే

టాలీవుడ్ సినీ తారలు దేశంలోనే ఫుల్ క్రేజున్న హీరోలుగా మారిపోతున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా తమ సత్తా చాటుకుంటున్నారు.

 Latest Survey Mahesh Babu Is The Tollywood Number One Hero Details, Latest Surve-TeluguStop.com

వారి సినిమాలు హిందీలోకి డబ్ కావడంతో పాటు, ప్రస్తుతం పలువురు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు.దీంతో వారి పాపులారిటీ రోజు రోజుకూ పెరిగిపోతుంది.

తాజాగా సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ టాలీవుడ్ మేల్ స్టార్స్ ఎవరేనే సర్వేను ఆర్ మాక్స్ మీడియా నిర్వహించింది.ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ గా నిలిచాడు.ఆ తర్వాతి స్థానాల్లో ఎవరున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌హేశ్‌ బాబు

టాలీవుడ్ మిల్క్ బాయ్ మహేష్ బాబు. తాజా సర్వేలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా నిలిచాడు.టాలీవుడ్ లోని టాప్ హీరోలను వెనక్కి నెట్టి ఆయన ఈ స్థానాన్ని పొందాడు.అటు వచ్చే ఏడాది ఏప్రిల్ 1న ఈయన నటించిన సర్కారు వారి పాట అనే సినిమా జనాల ముందుకు వస్తోంది.

అల్లు అర్జున్‌

మోస్ట్ పాపులర్ టాలీవుడ్ మేల్ స్టార్స్ సర్వేలో ఈ అల్లు వారి అబ్బాయి సెకెండ్ ప్లేస్ లో నిలిచాడు.ఈయన సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప పార్ట్-1తో డిసెంబ‌ర్ 17న జనాల ముందుకు వస్తున్నాడు.

ప్ర‌భాస్‌

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ మూడో ప్లేస్ లో నిలిచాడు.ఈయన ప్రస్తుతం రాధే శ్యామ్‌, ఆదిపురుష్‌, స‌లార్‌, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌

పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఈ సర్వేలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.ఈయన 2022 జనవరి 12న భీమ్లా నాయక్ సినిమాతో జనాల ముందుకు వస్తున్నాడు.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు మోస్ట్ పాపులర్ టాలీవుడ్ మేల్ స్టార్స్ లిస్టులో ఐదో ప్లేస్ దక్కించుకున్నాడు.ప్రస్తుతం ఈయన నటిస్తున్న ఆర్ఆర్ఆర్‌ మవీ 2022 జ‌న‌వ‌రి 7న జనాల ముందుకు వస్తుంది.

రామ్‌ చ‌ర‌ణ్‌

ఈ లిస్టులో రామ్ చరణ్ ఆరో స్థానంలో నిలిచాడబు.

నాని

నాచుర‌ల్ స్టార్‌ నాని మోస్ట్ పాపులర్ టాలీవుడ్ మేల్ స్టార్స్ లిస్టులో 7 ప్లేస్ లో ఉన్నాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌

రౌడీ హీరో విజయ్ కి 8వ స్థానం ద‌క్కింది.

నాగ‌ చైత‌న్య‌

నాగార్జున తనయుడు నాగ‌ చైత‌న్య‌కు ఈలిస్టులో తొమ్మిదో స్థానం ల‌భించింది.

చిరంజీవి

టాలీవుడ్ మెగా స్టార్ ఈ లిస్టులో 10వ ప్లేస్ దక్కించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube