టీనేజ్ ప్రారంభం అయిందంటే చాలు.మొట్ట మొదట వేధించేది మొటిమలే.
వీటిని ఎంత వదిలించుకునేందుకు ప్రయత్నించినా.అస్సలు వదలవు.
ఈ క్రమంలోనే రకరకాల క్రీములు కొనుగోలు చేస్తూ వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కొందరైతే మొటిమలను నివారించుకునేందుకు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.
అయితే నిజానికి సరైన పద్ధతులను పాటిస్తే చాలా అంటే చాలా సులభంగా మొటిమలను తగ్గించుకోవచ్చు.ముఖ్యంగా మొటిమలను నివారించేందుకు ఆలివ్ ఆయిల్ గ్రేట్‌గా సహాయపడుతుంది.
ఆలివ్ ఆయిల్లో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషక విలువలు మొటిమలనే కాదు.వాటి తాలూకు మచ్చలను సైతం తగ్గించ గలవు.మరి ఇంతకీ ఆలివ్ ఆయిల్‌ను చర్మానికి ఎలా ఉపయోగించాలి.? అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, అర స్పూన్ ఉప్పు మరియు పావు నిమ్మ రసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు ఆర బెట్టుకోవాలి.ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే మొటిమలు మరియు మచ్చలు త్వరగా తగ్గు ముఖం పడతాయి.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ తేనె, చిటికెడు పసుపు, అర స్పూన్ పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట అప్లై చేసుకుని పది లేదా పది హేను నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కూల్ వాటర్‌తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
ఇలా రోజూ చేసినా కూడా మొటిమల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.