దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారులను ముందస్తుగా అప్రమత్తం చేస్తోంది.గత కొంత కాలంగా KYC పేరుతో భారీగా మోసాలు పెరిగిపోయాయి.
భారతదేశంలో ఎక్కువగా మోసపోయేవారిలో ఎస్‌బీఐ కస్టమర్లే ఉండడంతో ఎస్‌బీఐ తమ ఖాతాదారులను కేవైసీ మోసాలపై అలర్ట్ చేస్తోంది.కేవైసీ మోసాలు నిజమే అని, మీరూ ఇలాంటి మోసాల బారినపడ్డాగాని, మిమ్మల్ని ఎవరైనా మోసం చేయాలని చూసినాగాని ఈ కింద వెబ్ సైట్ లో https://cybercrime.gov.in కంప్లైంట్ చేయాలని ఎస్‌బీఐ కోరుతోంది.అసలు ఈ కేవైసీ మోసాలు ఎలా జరుగుతాయంటే ముందుగా సైబర్ నేరగాళ్లు సంబంధిత బ్యాంకు ప్రతినిధులుగా మారి ఎస్‌బీఐ కస్టమర్లను టార్గెట్ గా చేసుకుని వారికి కాల్ చేస్తూ ఉంటారు.
ఆ తరువాత ఏటీఎం కార్డు వేలిడిటీ అయిపోయిందని మీ కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలనీ, లేదంటే ఏటీఎం కార్డు పనిచేయదని నమ్మశక్యంగా చెప్పి కస్టమర్లను మోసం చేయాలనీ చూస్తుంటారు.వారి మాటలు నమ్మి ఎవరన్నా వివరాలు తెలియచేస్తే క్షణాల్లో మీ అకౌంట్ ఖాళీ చేస్తారు.
బ్యాంకు ప్రతినిధుల ఎప్పుడు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ గాని, మెసేజెస్ గాని చేయమని, వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించమని ఎస్‌బీఐ చెబుతోంది.మీకు ఎస్‌బీఐ పేరుతో ఏవైనా లింక్స్ వస్తే అస్సలు క్లిక్ చేయొద్దు అని, అలాగే కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలని లింక్స్ వచ్చినా పట్టించుకోవద్దని హెచ్చరించింది.
ఒకవేళ మీకు మాటిమాటికి ఈ – మెయిల్స్ వస్తున్నట్టైతే ఆ మెయిల్ ఐడీని బ్లాక్ చేయమని హెచ్చరికలు జారీ చేసారు.ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు.వాట్సప్ ద్వారా కూడా ఎస్‌బీఐ లోగో ఉపయోగించుకొని ఈ మెసేజెస్ చేస్తున్నారు.ఎస్‌బీఐ లోగో కనిపించేసరికి కస్టమర్లు నిజంగానే బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందని అనుకుంటున్నారు.మీకు కనుక మీ కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయమని పదే పదే మెసేజెస్ వస్తుంటే https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కంప్లైంట్ చేయొచ్చు.
అలాగే 18004253800, 1800112211 టోల్ ఫ్రీ నెంబర్స్‌కు కాల్ చేసి కంప్లైంట్ కూడా చేయొచ్చు.