యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు బుల్లితెర పై ఎవరు మీలో కోటీశ్వరులు షో చేస్తున్నాడు.
ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.
రాజమౌళి ఈ సినిమాను పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించాడు.
కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కాబోతుంది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.
మరి కొద్దీ రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.ఇక ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు.
ఇలా ఎన్టీఆర్ చేతినిండా సినిమాలతో, షోలతో బిజీగా ఉన్నాడు.
అయితే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఎన్నో అద్బుతమైన సినిమాలను తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ ఇప్పుడు ఆలియా భట్ తో ”గంగూబాయి కతియవాదీ” సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అయితే ఈ సినిమా తర్వాత భన్సాలీ తారక్ తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.ఇక ఇప్పటికే తారక్ తో భన్సాలీ మాట్లాడారని.ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.
ఇక వీళ్ళ కాంబోలో చారిత్రక నేపథ్యంలో సినిమా వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.భారీ బడ్జెట్ తో పీరియాడిక్ సినిమాగా రూపొందే ఈ సినిమాను విఎఫ్ఎక్స్ సంస్థ స్కెచ్ కూడా సిద్ధం చేస్తుందని అనుకుంటున్నారు.
మరి చూడాలి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ అవుతాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి.