సంధ్యా రాజు కీలక పాత్రలో నటించిన నాట్యం సినిమా మొన్న శుక్ర వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కు రివ్యూలు చాలా పాజిటివ్ గా వచ్చాయి.
ఇలాంటి డాన్స్ కాన్సెప్ట్ సినిమా లు ముందు ముందు మరిన్ని రావాలని ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు డాన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ రివ్యూలు ఇచ్చారు.సినిమాకు వచ్చిన రివ్యూలకు వస్తున్న వసూళ్లకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది.
సాదారణంగా అయితే ఒక మాస్ హీరో సినిమాకు మోస్తరు రేటింగ్ వస్తే వసూళ్లు దుమ్ము రేపుతాయి.కాని ఈ సినిమా కు మోస్తరును మించి రేటింగ్ ఇచ్చారు.
అయినా కూడా వసూళ్ల విషయంలో మాత్రం నిరాశ తప్పడం లేదు.నాట్యం సినిమా కు వస్తున్న వసూళ్లు తీవ్ర నిరుత్సాహంను కలిగిస్తున్నాయంటూ టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా వసూళ్ల విషయంలో ఏ సెంటర్ లో అయినా కాస్త పాజిటివ్ ఉంటుందని ఆశించారు.కాని అక్కడ కూడా పెద్దగా సందడి కనిపించడం లేదు.
సినిమాకు చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, ఉపాసన ఇంకా పలువురు ప్రముఖులు ప్రమోషన్ చేయడం జరిగింది.ఎన్టీఆర్ కూడా సినిమాకు బెస్ట్ విషెష్ చెప్పాడు.ఇంతటి ప్రమోషన్ ఒక మాస్ సినిమాకు దక్కి ఉంటే ఖచ్చితంగా ఓపెనింగ్స్ భారీగా ఉండేవి.అదే సినిమాకు ఇంతటి రేటింగ్ ఉంటే ఖచ్చితంగా మరో లెవల్ అన్నట్లుగా ఉండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాని మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా కనీసం రెండున్నర కోట్లు కూడా వసూళ్లు చేసే అవకాశాలు కనిపించడం లేదు అంటూ విశ్లేషకులు అంటున్నారు, రికార్డు వసూళ్ల మాట ఏమో కాని బిజినెస్ చేసిన దాంట్లో సగం కూడా వసూళ్లు కనిపించడం లేదు అంటున్నారు.నాట్యం వంటి ప్రయోగాత్మక సినిమా లు కేవలం అవార్డుల కోసమే తప్ప వాటిని జనాలు చూడరు అంటూ మళ్లీ నిరూపితం అయ్యింది.