యువ హీరో అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా చేస్తున్నాడు.మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో 26/11 టెర్రరిస్ట్ ఎటాక్ నేపథ్యంతో ఈ సినిమా వస్తుంది.
డెంగ్యూ కారణంగా కొన్నాళ్లు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన అడివి శేష్ మేజర్ కు సంబందించిన కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు.ఈ విషయాన్ని చెబుతూ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అనే నా ప్రయాణం దాదాపు పూర్తి కావొచ్చింది.
ఈ షెడ్యూల్ తర్వాత నేను అతని ఆరాధకుడిగా ఉంటాను.ఆయన్ను బాగా అర్ధం చేసుకున్న అభిమానిని.
మేజర్ సందీప్ ని కనుగొనడానికి ప్రయత్నించిన అభిమానిని అని అడివి శేష్ తన సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు.
గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్న మేజర్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో పాటుగా మూవీస్ సహకారంతో సోనీ ఫీచర్స్ ఫిల్మ్ ఇండియా కలిసి నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న మేజర్ సినిమాలో శోభిత దూళిపాళ్ల, సయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తారని తెలుస్తుంది.
మహేష్ సపోర్ట్ తో మేజర్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.