ప్రభాస్ అంటే పేరు కాదు అదొక బ్రాండ్ అని ప్రభాస్ అభిమానులు ఎంతో గర్వంగా ప్రభాస్ గురించి చెప్పుకుంటారు.అసలు సినిమాలంటే ఆసక్తి లేని ప్రభాస్ ను బలవంతంగా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చి ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో స్థాయికి ఎదిగారు.
ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా తనని ప్రపంచ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తీసుకు వచ్చిందని చెప్పవచ్చు.ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా ప్రభాస్ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
అయితే నేడు అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సినీ ప్రముఖులు అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి క్రేజీ అభిమానుల గురించి తెలుసుకుందాం.
తాజాగా ప్రభాస్ అభిమాని ఒకరు హోటల్ ప్రారంభించగా ఆ హోటల్ లోపల ప్రభాస్ రాధే శ్యామ్ పోస్టర్ను అతికించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అదేవిధంగా బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ కు ఇంతటి క్రేజ్ వచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ క్రమంలోనే ఈ పేరును ఒక హోటల్ యజమానులు ఉపయోగించుకొని ఆ హోటల్లో లభించే వాటికి బాహుబలి తాలీ, దేవసేన పరోటా, కట్టప్ప బిర్యానీ అంటూ సినిమాలోని పాత్రల పేర్లను ఉపయోగించుకున్నారు.ఇక ప్రభాస్ కు జపాన్ లో కూడా ఎంతోమంది అమ్మాయిలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
ఈ క్రమంలోనే జపాన్ లో ఉన్నటువంటి ప్రభాస్ అభిమానులు ఏకంగా ఆయన కోసం ఇండియాకు వచ్చే ఇండియాలో ప్రభాస్ ఇంటి ముందు ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఇలా ఎంతో మంది ప్రభాస్ కి క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు