బిగ్ బాస్ హౌస్ లోకి కెప్టెన్ గా మరోసారి కండలవీరుడు విశ్వ సెలెక్ట్ అయ్యాడు.ఈ క్రమంలోనే హౌస్ లో జరుగుతున్న పరిణామాలపై ప్రియా, రవి, శ్రీరామ్ చర్చించుకుంటారు.
ఇక బ్లాక్ కాఫీ కోసం రైస్ కుక్కర్ లో అన్నం ఉడుకుతుంటే దానిని పక్కన తీసి మరి కుక్కర్ ఆన్ చేయడం మర్చిపోతుంది.దీంతో ప్రియా శ్వేతల మధ్య గొడవ చోటు చేసుకుంటుంది.
ఇలా ప్రియ శ్వేత మధ్య గొడవ తారస్థాయికి చేరుకుంటుంది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో బడ్జెట్ టాస్క్ ప్రారంభం కావడంతో హౌ సభ్యులకు బిగ్ బాస్ వివిధ రకాల పోటీలను నిర్వహించారు.
ఈ క్రమంలోనే సిరి జెస్సీతో మాట్లాడుతూ షణ్ముఖ్ తనని అన్న మాటలు గురించి బాధపడుతుంది.షణ్ముఖ్ నాకు క్యారెక్టర్ లేదన్నాడు అలాంటప్పుడు నాతో స్నేహం చేయడం ఎందుకు అంటూ సిరి బాధపడటంతో జెస్సీ వాడు సరదాగా అన్నాడు నువ్వు సీరియస్ గా తీసుకోవద్దు అంటూ చెబుతాడు.
ఈ క్రమంలోనే సిరి మాట్లాడుతూ కొన్ని మాటలు ఎంతో బాధగా అనిపిస్తాయి.
అలాంటి మాటలను సిల్లీగా అంటే పర్లేదు కానీ ఇతరులతో కంపేర్ చేసుకొని అనడం ఎంతో బాధగా ఉంటుంది.ఆవేశంలో నువ్వు ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోవద్దు అంటూ జెస్సి సిరికి చెబుతాడు.వాడు అనంత మాత్రాన నేను సీరియస్ గా తీసుకోవడానికి చిన్నపిల్లనా అని మాట్లాడుతూ ఉండగా అంతలో అక్కడకు షణ్ముక్ రావడంతో ముగ్గురు కలిసి యధావిధిగా సరదాగా మాట్లాడుతూ ఉంటారు.
అంతలో ప్రియాంక అక్కడికి చేరుకొని నువ్వు నాకు ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తావ్ అని అడగడంతో నేను నీకు ప్రపోజ్ చెయ్యను సిరికి మాత్రమే ప్రపోజ్ చేస్తానని సమాధానం చెబుతాడు.
అంతలో షణ్ముఖ కలుగచేసుకుని సిరి ఏ యాంగిల్ లో నీకు నచ్చింది అంటూ కామెంట్ చేస్తాడు.అదే మాటే షణ్ముఖుని అడగడంతో షణ్ముఖ్ దీప్తి సునైనా గురించి ప్రస్తావిస్తూ నాకు హైట్ లుక్ లో ఉన్న ఫిగర్ కంటే గుణం ఉన్న వాళ్ళు ఇష్టమని చెప్పడంతో షణ్ముఖ తిరిగి తన ఇండైరెక్టుగా తనకు క్యారెక్టర్ లేదు గుణం లేదని అన్నాడని మరోసారి సిరి బాధపడుతుంది.