మారుతి, సంతోష్ శోభన్ ‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్..

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, సోసోగా ఉన్నా, ఎక్కేసిందే పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.

 Maruti, Santosh Shobhan 'manci Rojulu Vachai ' Trailer , Santhosh Shoban , Maru-TeluguStop.com

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.ఆద్యంతం వినోదాల విందుగా ఈ ట్రైలర్ సాగింది.

ముఖ్యంగా డైలాగులు చాలా అద్భుతంగా ఉన్నాయి.‘యువీ వాళ్లు రాధే శ్యామ్ తీసారని ఊరికే ఉన్నారా ఏక్ మినీ కథ తీయలేదు.కంటెంట్ ఎక్కుడుంటే అక్కడికి వెళ్లిపోవడమే’ అంటూ సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.సంతోష్ శోభన్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంది.

అలాగే అజయ్ ఘోష్ కామెడీ ట్రైలర్‌లో ఆకట్టుకుంది.దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కానుంది.

మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు.https://telugustop.com/wp-content/uploads/2021/10/manci-rojulu-vachai-tollywood-trailer-mahreen-kour.jpg

టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది.మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్.ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది.ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

నటీనటులు:

సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా

టెక్నికల్ టీం:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి నిర్మాత: వి సెల్యూలాయిడ్ SKN బ్యానర్స్: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ సంగీతం: అనూప్ రూబెన్స్ పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube