చైతూ చేతుల మీదగా 'అనుభవించు రాజా' టైటిల్ సాంగ్!

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అనుభవించు రాజా.ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ విడుదల అయ్యి మంచి అంచనాలే నెలకొన్నాయి.ఫస్ట్ లుక్ ను నాగార్జున విడుదల చేయగా.టీజర్ ను రామ్ చరణ్ విడుదల చేసారు.టీజర్ తోనే ఈ సినిమాపై మంచి అంచనాలు రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.

 Naga Chaitanya Released Anubhavinchu Raja Title Song Lyrical, Naga Chaitanya, An-TeluguStop.com

విడుదల అయినా టీజర్ మొత్తం గ్రామీణ వాతావరణంలో కోడి పందేలు, పేకాట, డాన్స్ లు వంటి వాటికీ అలవాటు పడ్డ జల్సా రాయుడు ఎలా ఉంటాడు అనే నేపథ్యంలో చూపించారు.

ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మొదటి పాట ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమా లోని ఫస్ట్ పాటను నాగ చైతన్య చేతుల మీదుగా విడుదల అయ్యింది.ఈ సాంగ్ చాలా హుషారుగా రాజ్ తరుణ్ క్యారెక్టర్ మొత్తం తెలిసేలా ఉంది.ఈ సినిమాలో రాజ్ తరుణ్ క్యారెక్టర్ టీజర్ చూస్తేనే అర్ధం అయ్యింది.ఇందులో రాజ్ తరుణ్ ను విలాసాలకు అలవాటు పడిన జూదగాడిగా నటిస్తున్నాడు.ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా.గోపి సుందర్ ట్యూన్ అందించారు.

ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా కాశిష్ ఖాన్ నటిస్తుంది.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్పీ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను నిర్మస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించ బోతున్నారు.అందుకే చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తూ ఈ సినిమాను ప్రజలకు చేరువ చేస్తుంది.

https://youtu.be/19me5pGFHLs
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube