మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో నాగబాబు విష్ణు గురించి, మోహన్ బాబు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రకాష్ రాజ్ కు చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయని ఆ ప్లస్ పాయింట్లు ఏవీ విష్ణుకు లేవని నాగబాబు కామెంట్లు చేశారు.
ప్రకాష్ రాజ్ కు సినిమా జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఉందని అందువల్ల అతనికే తను మద్దతు ప్రకటిస్తున్నానని నాగబాబు చెప్పుకొచ్చారు.
ప్రకాష్ రాజ్ స్థానికేతరుడు అయితే అతనికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎందుకు సభ్యత్వం ఇచ్చారని నాగబాబు ప్రశ్నించారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం ఉన్నవాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని నాగబాబు చెప్పుకొచ్చారు.ప్రకాష్ రాజ్ కళామతల్లికి సేవ చేయాలని అనుకుంటున్నాడని ఆయనతో నువ్వు మా వాడివి కాదని అనడం కరెక్ట్ కాదని నాగబాబు కామెంట్లు చేశారు.
విష్ణు మద్రాస్ లో పుట్టాడని అక్కడే చదువుకున్నాడని విష్ణు తల్లి, తండ్రి మాత్రమే తెలుగువాళ్లని నాగబాబు చెప్పుకొచ్చారు.విష్ణును తమిళవాడివని అనాల్సి వస్తుందని ప్రకాష్ రాజ్ కు, విష్ణుకు కలిసి పరీక్ష పెడితే ప్రకాష్ రాజ్ కు 90 మార్కులు వస్తాయని అదే సమయంలో విష్ణుకు పాస్ మార్కులు కూడా రావని నాగబాబు కామెంట్లు చేశారు.సినిమాలు చూడని వాళ్లతో ప్రకాష్ రాజ్, విష్ణు మాట్లాడితే ప్రకాష్ రాజ్ ను తెలుగోడు అంటారని విష్ణును తెలుగు నేర్చుకోమని చెబుతారని నాగబాబు చెప్పుకొచ్చారు.
ప్రకాష్ రాజ్ కు నిర్మాతలతో విభేదాలు ఉన్నాయని మీరు చెప్పారని సలీం సినిమా విషయంలో రెమ్యునరేషన్ విషయంలో మీరు ఫ్రాడ్ చేశారని వైవీఎస్ చౌదరి కోర్టుకు వెళ్లాడంటూ విష్ణు కుటుంబానికి కూడా కాంట్రవర్సీలు ఉన్నాయని నాగబాబు చెప్పుకొచ్చారు.నాగబాబు కామెంట్ల గురించి విష్ణు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.