విమ‌ర్శ‌ల‌పై మౌనంగా ఉంటున్న టీఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్లు.. కేటీఆర్ సీరియ‌స్‌..?

గ‌త ప్ర‌భుత్వంలో టీఆర్ ఎస్‌కు అస‌లు తిరుగే లేకుండా పోయింది.వారు ఏది చేస్తే అదే ట్రెండ్ అన్న‌ట్టు సాగిపోయేది.

 Trs Fire Brands Silent On Criticism Ktr Series , Trs, Ktr-TeluguStop.com

కానీ ఈసారి ప్ర‌భుత్వ హ‌యాంలో సీన్ మారిపోయింది.మ‌రీ ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్‌, అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లాంటి వారు ప‌గ్గాలు చేప‌ట్టాక ఆ పార్టీల‌ నేత‌లు కేసీఆర్ మీద‌, కేటీఆర్ మీద ఓ రేంజ్‌లో ముప్పేట దాడి చేస్తున్నారు.

ప్ర‌తి చిన్న‌దానికి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ తిట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.కానీ వీటితో పాటు నిత్యం ఈ పార్టీలు ఏదో ఒక ఆందోళనను చేస్తున్నాయి.

ఇందులో ముఖ్యంగా టీఆర్ఎస్ మీద‌నే విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నాయి.దీంతో వీరికి చెక్ పెట్ట‌డంలో టీఆర్ ఎస్ విఫ‌ల‌మ‌వుతోంద‌నే అభిప్ర‌యాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.టీఆర్ ఎస్‌లో ఎవరికి వారుగా ఉన్నార‌నే విమ‌ర్శ‌లు వీరి మౌనానికి నిద‌ర్శ‌నం అని చెబుతున్నారు.టీఆర్ఎస్ వీరు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ఎందుకు తిప్పి కొట్ట‌లేక‌పోతోంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

వాస్త‌వానికి టీఆర్ ఎస్ కు మంచి ఫైర్ బ్రాండ్లు కూడా ఉన్నారు.అలాంటి వారు ఉద్యమ సమయంలో చూపించినంత జోష్ ఇప్పుడు చూపించ‌ట్లేదు.

కార‌ణాలు ఏమైనా కూడా వీరి మౌనం అధిష్టానానికి ఇబ్బంది క‌రంగా మారింది. కేసీఆర్, కేటీఆర్ ఎవ‌రు ఎన్ని మాట‌లు అన్నా త‌మ‌ను కాద‌న్న‌ట్టుగానే పట్టించుకోనట్లుగా అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు కూడా సైలెంట్‌గా ఉండ‌టంతో కేటీఆర్ వీరిపై ఫోక‌స్ పెట్టిన‌ట్టు చెబుతున్నారు.

వారంద‌రిపై రీసెంట్ గా కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.వారికి క్లాస్ పీకి మ‌రీ సైలెంట్ గా ఉండొద్ద‌ని రివ‌ర్స్ కౌంట‌ర్లు వేయాల‌ని సూచించారంట‌.పార్టీకి న‌ష్టం వాటిల్లేదాకా చూడొద్ద‌ని వెంట వెంట‌నే విమ‌ర్శ‌ల‌పై చెక్ పెట్టేలా ప్రెస్ మీట్లు పెట్టి కౌంట‌ర్లు వేయాలంటూ చెప్పారంట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube