త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.ఈ చిత్రం ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత రాక్షసుడు, ఉన్నది ఒకటే జిందగీ, శతమానంభవతి వంటి చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈమెకు కొంతవరకు అవకాశాలు తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఈమె క్రికెటర్ తో ప్రేమలో ఉందంటూ ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో ఉండే అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది.ఈ క్రమంలోనే నెటిజెన్స్ అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ ప్రేక్షకులను సందడి చేసిన ఈ బ్యూటీకి ఒక నెటిజన్ నుంచి విచిత్రమైన ప్రశ్న ఎదురయింది.
ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అనుపమ పరమేశ్వరన్ ను తను బికినీ వేసుకున్నటువంటి ఫోటో పంపించమని అడగడంతో ఎంతో కోపం తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఎవరు ఊహించని విధంగా ఆ నెటిజెన్ కి రిప్లై ఇచ్చింది.
ఈ క్రమంలోనే సదరు నెటిజెన్ ప్రశ్నకు సమాధానం చెబుతూ….నీ ఇంటి అడ్రస్ చెప్పు నీ ఇంటికి నా ఫోటో పంపిస్తా.ప్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకో అంటూ అనుపమ సదరు నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.
ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయంతెలిసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన 18 పేజెస్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.