మరీ ఘోరంగా దొంగలు రెచ్చిపోయారు.దొంగలించారని పట్టుకోబోతే వారి దగ్గర ఉన్న తుపాకీతో కాల్చి పరారయ్యారు.
స్థానికంగా ఈ ఘటన ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది.ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని సమాచారం.
ఈ ఘటన హర్యానా పరిధిలోని ఫరీదాబాద్‌లోని సెక్టార్ -23 సంజయ్ కాలనీలో చోటుచేసుకుంది.ఫరీదాబాద్ సిటీ ఢిల్లీ పరిధిలోకి వస్తుంది.
ఈ సంఘటనకి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
మోహిత్ సంజయ్ అనే వ్యక్తికి ఫరీదాబాద్ సెక్టార్ 23లోని రాజేంద్ర చౌక్ సమీపంలో కిరాణా దుకాణం ఉంది.
ప్రతిరోజులానే ఈ నెల 28వ తేదీన కూడా రాత్రి 10 గంటలకు దుకాణం మూయడానికి వెళ్ళాడు.అయితే అదే సమయంలో ఇద్దరు దుండగులు ముసుగు ధరించి వచ్చి మోహిత్ సంజయ్ ని నెట్టి షాపులోకి ప్రవేశించారు.
అక్కడితో ఆగకుండా మోహిత్ సంజయ్ ను లోపలి యోకి నెట్టేసి షెల్టర్ వేశారు.ఆ ఇద్దరు దుండగులు తుపాకులతో వచ్చారు.
లోపల షాప్ కీపర్ ని కొట్టడం మొదలు పెట్టారు.అతని వద్ద ఉన్న బంగారు గొలుసు, మొబైల్ ఫోన్ కూడా తీసుకున్నారు.
అక్కడితో ఆగకుండా షాపులో ఉన్న 4 లక్షలను దోచుకున్నారు.అయితే అరుపులు విన్న వ్యాపారి తండ్రి వెంటనే పరిగెత్తుకుంటూ కిందికి వచ్చాడు.
అయితే అప్పటికే డబ్బులని, బంగారాన్ని దోచుకున్న దుండగులు బైక్ దగ్గరికి వెళ్లిపోయారు.మరో దొంగ వెళ్లి బైక్ స్టార్ట్ చేస్తుండగా వ్యాపారి తండ్రి వలల్ని పట్టుకోడానికి వెళ్ళాడు.
దీంతో వాళ్ళని పట్టుకుంటాడేమో అని భయపడిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు.ఆటను అక్కడే కిందపడిపోయాడు.
అక్కడ ఉన్న వాళ్ళు ఇది గమనించి పట్టుకోవాలని ప్రయత్నించగా వాళ్లపై కూడా కాల్పులు జరిపి పరారయ్యారు.వ్యాపారి తండ్రి పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.
స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.