పోసానిని మెంటల్ హాస్పిటల్‌లో చేర్చండి.. నిహారిక షాకింగ్ కామెంట్స్!

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన విమర్శలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 Niharika Konidela Reacted Over Posani Krishna Murali Comments-on Pawan-kalyan Po-TeluguStop.com

ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని అతని పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.గత రెండు రోజుల నుంచి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ను, అతని కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో పెద్ద ఎత్తున విమర్శించడంతో పోసాని పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ పై పోసాని తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించడంతో మెగా బ్రదర్ నాగబాబు పలు మీమ్స్, వీడియోల ద్వారా పోసానికి తనదైన శైలిలో కౌంటర్ వేశారు.ఈ క్రమంలోనే జనసేన పార్టీ నాయకురాలు నిహారిక ఈ విషయంపై స్పందిస్తూ పోసాని కృష్ణ మురళి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్న పోసాని గురించి జనసేన నాయకురాలు నిహారిక మాట్లాడుతూ తనని ముందు మెంటల్ హాస్పిటల్ లో చేర్పించండి పేరుకు తగ్గట్టుగానే మెంటల్ కృష్ణ సినిమా తీసి ఇప్పుడు అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు.రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోనే పోసాని ఇలా స్పందిస్తున్నారు.

Telugu Janaseena, Pawan Kalyan, Posanimurali, Republicpre, Tollywood-Movie

ఈ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఆడవారి గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని అతని హాస్పిటల్ లో చేర్పించాలని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ జనసేన పార్టీ కార్యకర్త నిహారిక డిమాండ్ చేశారు.ఇలా ఈమె పోసాని కృష్ణ మురళి పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.పోసాని అనుచిత వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేసిన పోసాని కృష్ణ మురళి పై బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube