'నాని వివాదం నాకు బాధ కలిగించింది'..నానికి పవన్ మద్దతు!

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల అవ్వబోతుంది.

 Pawan Speech In Sai Dharam Tej Republic Pre Release Event , Pawan Kalyan, Republ-TeluguStop.com

ఈ మధ్యనే సాయి ధరమ్ తేజ్ యాక్సిండెంట్ లో గాయపడిన సంగతి అందరికి తెలుసు.సాయి ధరమ్ తేజ్ కు బైక్ ప్రమాదం జరగకపోయి ఉంటే ఈ పాటికి రిపబ్లిక్ ప్రమోషన్స్ తో బిజీగా ఉండేవాడు.

కానీ అనుకున్న విధంగా జరగలేదు.

కానీ రిపబ్లిక్ సినిమాను వాయిదా వేయకుండా అదే డేట్ కు విడుదల చేయాలనీ నిర్మాతలు ముందడుగు వేశారు.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది.ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈయన చాలా విషయాలపై మాట్లాడారు.

అందులో నాని వివాదం గురించి కూడా పవన్ మాట్లాడారు.ఈ మధ్య నాని నటించిన టక్ జగదీష్ సినిమా విషయంలో నానిపై చాలా విమర్శలు వచ్చాయి.టక్ జగదీష్ సినిమాను థియేటర్స్ లో విడుదల చెయ్యలేదని థియేటర్ యజమానులు నానిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

నానిపై విమర్శలు చేసిన వారిపై పవన్ సీరియస్ అయ్యారు.

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ స్పీచ్ లో నాని గురించి కూడా మాట్లాడారు.

ఆయనకు కలిగిన ఇబ్బందిపై అయన నిలదీశారు.నాని ని తప్పుపట్టే థియేటర్ యజమానులపై ఘాటు వ్యాఖ్యలు చేసారు.

నాని పై విమర్శలు చేసే ముందు మీరు వెళ్లి వైసీపీ లీడర్లతో మాట్లాడుకోవాలి అన్నారు.నానిని విమర్శించినప్పుడు నాకు బాధ కలిగింది.

ఒక వైపు థియేటర్స్ మూసేసి ఉంటే థియేటర్స్ లో సినిమా ఎలా రిలీజ్ చేస్తారు.అందుకే గత్యంతరం లేక ఓటిటి కి వెళ్లాల్సి వచ్చింది.

Telugu @republic, Nani, Pawan Kalyan, Pawanspeech, Sai Dharamtej, Tuck Jagadish-

కానీ ఇక్కడ తప్పు నాని ది అయినట్టు మాట్లాడతారేం.థియేటర్ యజమానులు వెళ్లి వైసీపీ లీడర్లను నిలదీయండి.పాపం ఆ అబ్బాయి మీద పడితే ఆ అబ్బాయి ఎం చేస్తాడు.అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.ఈ మేరకు తన మద్దతు అంత నానికి తెలియజేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube