మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానించే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు.రీఎంట్రీలో కూడా భారీస్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ చిరంజీవి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే చిరంజీవి సినిమాల్లోకి రావడానికి కారణమైన వ్యక్తి ఎవరనే ప్రశ్నకు సమాధానం మాత్రం చాలామంది అభిమానులకు తెలియదు.రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా చిరంజీవి హీరో అనే సంగతి తెలిసిందే.
బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్నారు.సినిమా ఇండస్ట్రీలో నటులుగా ఎదగాలనుకునే ఎంతోమందికి చిరంజీవి స్పూర్తి నే విషయం తెలిసిందే.
కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు వేసిన చిరంజీవి తర్వాత కాలంలో స్టార్ హీరో స్టేటస్ ను అందుకోవడంతో పాటు నటుడిగా తన స్థాయిని పెంచుకోవడం గమనార్హం.అయితే తాను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఒక వ్యక్తి కారణమని చిరంజీవి పలు సందర్భాల్లో వెల్లడించారు.
చీరాలలో చిరంజీవి తండ్రి ఎస్సైగా పని చేసే సమయంలో ఆ స్టేషన్ లో వీరయ్య అనే మరో వ్యక్తి కానిస్టేబుల్ గా పని చేసేవారు.చిరంజీవి డైలాగులు చెబితే వీరయ్య అభినందించడంతో పాటు మద్రాస్ కు వెళ్లాలని చిరంజీవికి సూచించేవారు.
వీరయ్య మాటలు చిరంజీవిపై ప్రభావం చూపడంతో పాటు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలనే కోరికను చిరంజీవిలో పెంచాయి.వీరయ్య చిరంజీవికి స్టూడియోలో ఫోటోలు తీయించి ఆ ఫోటోలను మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు పంపారు.
ఆ తర్వాత చిరంజీవికి అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఛాన్స్ దక్కింది.వీరయ్య తనలో నింపిన స్పూర్తి వల్లే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని చిరంజీవి పలు సందర్భాల్లో వెల్లడించారు.చిరంజీవి నటించిన ఆచార్య సినిమా త్వరలో రిలీజ్ కానుంది.