నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తున్న సినిమా టక్ జగదీష్.షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమా నిర్మించగా సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటించారు.
థమన్ పాటలకు, గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా ప్రేక్షకులను అలరించేలా ఉందని చెప్పొచ్చు.ఇక సినిమాను సెప్టెంబర్ 10న డిజిటల్ రిలీజ్ అనుకున్నారు.
అయితే అనుకున్న టైం కన్నా ముందే అంటే సెప్టెంబర్ 9న రాత్రికే టక్ జగదీష్ అమేజాన్ ప్రైం లో వస్తుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచగా సినిమా ట్రైలర్ లో స్టోరీ మొత్తం చెప్పినా డైరక్టర్ శివ నిర్వాణ ఆ కథ కోసం బలమైన సన్నివేశాలు రాసుకున్నట్టు తెలుస్తుంది.
ఇక ఇదిలాఉంటే నాని టక్ జగదీష్ డిజిటల్ రిలీజ్ పై ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది.అంతేకాదు సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందని ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంది.
ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాని నటించిన వి ఓటీటీ రిలీజై నిరాశపరచింది.అందుకే టక్ జగదీష్ పై అన్ని అంచనాలు పెట్టుకున్నారు.