ఏఐ టెక్నాలజీతో అద్దుతాలు చేయవచ్చంటూ మరోసారి నిరూపించాడు 28 ఏళ్ల ఈజిప్టు ఇంజనీర్ మహమ్మద్ ఎల్ కోమి.ఇంతకీ ఆ అద్భుతం ఏంటో తెలుసా .ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఓ రోబో ఎడారి ప్రాంతంలో మంచి నీరు తయారు చేస్తుందట.ఆ రోబో పేరు ఇలూ.
ఇంతకీ రోబో నీటిని ఎలా తయారు చేస్తుందని ఆశ్చర్య పోతున్నారా.? కృత్రిమ మేధస్సు సాయంతో గాలిలో ఉన్న తేమను నీటిగా మారుస్తుందంట.ఇంజనీర్ ఎల్ కోమి మాట్లాడుతూ.ఈ రోబో తేమను గ్రహించి అంగారకుడిపై కూడా నీటిని తయారు చేయగలదని అన్నారు.దీంతో అంగారక గ్రహం పైకి వెళ్లే వ్యోమగాములకు నీటి కొరత ఉండదని పేర్కొన్నారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు ఈ ఇలు రోబో ఇతర సాంకేతికతతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని అందించగల సాంకేతికతో తయారు చేయబడిందని, ఇది కృత్రిమ మేధస్సుతో పని చేస్తుందని ఇంజనీర్ ఎల్ కోమి తెలిపారు.
ఈ రోబోను రిమోట్ తో నియంత్రించవచ్చునని, తాను రోజుకు 5000 లీటర్ల నీటిని అందించగలిగే ఇటువంటి అనేక రోబోలను ఎటువంటి సమస్య లేకుండా తయారు చేయగలనని చెప్పాడు.
కేవలం 9 నెలల్లో ఇలూ రోబో తయారు చేశానని, నీరు అస్సలు అందుబాటులో లేని, కరువు ప్రాంతాల్లో పలు రోబో ఎక్కువగా నీటి తయారు చేస్తుంది.
ఎటువంటి ప్రాంతమైనా ఇక నుండి నీటి సమస్య లేకుండా రోబోను ఉపయోగించి నీటిని తయారు చేయవచ్చునని ఎల్ కోమి తెలిపారు.ఈ రోబోను సిద్ధం చేయడానికి దాదాపు రూ.18 వేలు ఖర్చు చేశాననిన్నారు.అయితే ఇలూ నుంచి కేవలం 7 పైసలు ఖర్చుతో ఒక లీటర్ నీటిని తయారు చేయవచ్చునని, కానీ మెకానికల్ హీట్ ఎక్స్ చేంజర్ల సాయంతో మాత్రం 75 పైసలు ఖర్చు అవ్వనుందని ఇంజనీర్ ఎల్ కోమి తెలిపారు.
దీంతో ఇలూ రోబోను అందుబాటులోకి తీసుకొస్తే ఇక ఎడారి ప్రాంతంలోనైనా నీటి సమస్య ఉండదని పలువురు హర్షిస్తున్నారు.