ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతుండటం మనం చూడొచ్చు.తాజాగా ముళ్ల పంద, చిరుత కొట్లాడుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.
అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు అయిన చిరుత వేట భయానకంగా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే.చిరుత తాను ఎంచుకున్న జంతువులను కనుచూపు మేర నుంచి తప్పించుకోకుండా, వాయువేగంతో వెళ్లి అటాక్ చేసి వేటాడుతుంటుంది.
ఇకపోతే చిరుతకు వేగం అనేది బలం కాగా, ఇతర జంతువులకు ఇంకొన్ని బలాలుంటాయి.ఏనుగు అతి పెద్ద జంతువు కాగా ముళ్ల పందికి ముళ్లే బలం.వాటితో తనను తాను కాపాడుకుంటుంది ఈ జంతువు.వైరలవుతున్న సదరు వీడియోలో రోడ్డుపై చిరుత ముళ్ల పందిని వేటాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అయితే, ముళ్ల పంది చిరుతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నది.తన ముళ్లతో క్రూరమృగమైన చిరుతను భయపెడుతూ.
ముళ్లతో గుచ్చుతోంది.అలా సుమారు గంట పాటు ముళ్ల పంది, చిరుత మధ్య భీకకర పోరు జరిగింది.
చిరుత పలుసార్లు ముళ్లపందిని వేటాడేందుకు ప్రయత్నించిన క్రమంలో దాని ముళ్లు గుచ్చుకుని చిరుత విలవిల లాడిపోయింది.మొత్తంగా ఈ భీకర పోరులో ముళ్ల పంది నెగ్గడం గమనార్హం.
ఈ వీడియోను ఐపీఎస్ అధికార రూపిన్ శర్మ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయగా, అది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇక ఆ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ముళ్ల పంది చిరుతను ఓడించగలిగిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చిరుతను గడగడలాడించిన ముళ్లపంది అని కామెంట్స్ చేస్తున్నారు.ముళ్ల పంది తనను రక్షించుకోగలిగిందని మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.చాలా మంది ట్విట్టర్ యూజర్స్ ఈ వీడియోను రీ ట్వీట్ చేయగా, ఎక్కువ మంది ఈ వీడియో చూసి చిరుత ఓడిపోయిందంటే నమ్మలేకపోతున్నామని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.