1.రెండో రోజు కొనసాగుతున్న బండి పాదయాత్ర
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది.
2.ఆత్మహత్య చేసుకుంటా : మోత్కుపల్లి
తెలంగాణలో దళిత బంధు పథకం వంద శాతం నమోదు కాకపోతే యాదగిరిగుట్ట వద్ద ఆత్మహత్య చేసుకుంటానని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
3.ఎంపీ హెచ్ లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ 2021-22 లో ప్రవేశానికి కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పంపాలని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.
4.ప్రత్యక్ష తరగతులకు వ్యతిరేకంగా పిల్
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలను తెరవాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
5.అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లీష్ మీడియం
అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
6.వ్యాక్సినేషన్ డ్రైవ్ పొడిగించనున్న జిహెచ్ఎంసి
జిహెచ్ఎంసి లో 100% వ్యాక్సినేషన్ డ్రైవ్ను మరికొంత కాలం పొడిగింపు ఉన్నారు మూడు రోజుల్లో ముగియనుంది స్పెషల్ డ్రైవ్ 100% టార్గెట్ పూర్తి కాకపోవడంతో మరి కొంతకాలం పొడిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
7.టి పి సి సి ముఖ్య నేతల కీలక సమావేశం
హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక కోసం సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్ లో టిపిసిసి సమావేశం నిర్వహించనున్నారు.
8.బీజేపీ ఆఫీస్ బేరర్స్ బేటీ
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంఘాల యాత్ర రెండో రోజు పురస్కరించుకుని మెహదీపట్నం లోని పుల్లారెడ్డి కళాశాలలో బీజేపీ ఆఫీస్ బేరర్ సమావేశం నిర్వహిస్తున్నారు.
9.తెలంగాణ ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం ఎంపిక
తెలంగాణ ఫిలిం చాంబర్ నూతన అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు.
10.ఎల్లంపల్లి ఎనిమిది గేట్లు ఎత్తివేత
ఎల్లంపల్లి ప్రాజెక్టు కు వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రాజెక్టులోని ఎనిమిది గేట్లు అధికారులు ఎత్తివేశారు.
11.ఒకటి నుంచి జూనియర్ ఇంటర్ తరగతులు
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ప్రారంభమవుతాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
12.హరిక్రిష్ణ కు నివాళులు
రాజ్యసభ మాజీ సభ్యులు దివంగత నందమూరి హరికృష్ణ మూడో వర్ధంతి సందర్భంగా విజయవాడ టిడిపి కార్యాలయంలో నివాళులర్పించారు.
13.ట్రైనీ ఎస్సై ఆత్మహత్య
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న భవాని పి టి సి కి విజయనగరం కు వచ్చారు.అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
14.స్టీల్ ప్లాంట్ కార్మికుల మానవహారం
విశాఖ స్టీల్ ట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టి 199 రోజులు పూర్తయిన తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికులు భారీ మానవహారం ఏర్పాటు చేశారు.
15.నేడు అనంతపురం జిల్లాకు డిఆర్డిఎ శాస్త్రవేత్తల రాక
డి ఆర్ డి ఎ శాస్త్రవేత్తలు ఆదివారం అనంతపురం జిల్లాకు రానున్నారు.
16.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.శనివారం తిరుమల శ్రీవారిని 24,057 మంది దర్శించుకున్నారు.
17.కర్నూలులో లోకాయుక్త కార్యాలయం
రాష్ట్ర లోకాయుక్త కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేశారు.
18.కెసిఆర్ కు ప్రకాశం జిల్లా టిడిపి నేతల లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు లేఖ రాశారు.వెలిగొండ ప్రాజెక్టు పై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కోరారు.
19.కార్వీ ఎండీ పోలీస్ కష్టడికి అనుమతించిన కోర్టు
కార్వి ఎండీ పార్థసారథిని ఆదివారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.ఈ మేరకు రెండు రోజుల పాటు ఆయన ను విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,660 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,660 .