అన్ని విషయాల్లోనూ ఎప్పుడు పైచేయి తనదే ఉండాలని అనుకుంటారు టిడిపి అధినేత చంద్రబాబు.ఓటమి ఎదురైనా, దానిని తనకు అనుకూలంగా మార్చుకుని మళ్ళీ విజయం వైపు ఎలా అడుగులు వేయాలనేది చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.
తెలుగుదేశం పార్టీకి ఘోరమైన పరాభవం 2019 ఎన్నికల్లో ఎదురైనా, చంద్రబాబు ఎక్కడా అధైర్యపడలేదు.వైసీపీ ప్రభుత్వం పై ఏదో రకంగా పోరాడుతూనే ఉన్నారు.
జాతీయ స్థాయిలో తమకు మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు.ఏదో ఒక బలమైన పార్టీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు.
ఈ మేరకు బస్సుయాత్ర, సైకిల్ యాత్ర తదితర వాటిని పరిశీలిస్తున్నారు .ఒకవైపు జనసేన మరోవైపు బిజెపి పార్టీలతో పొత్తు కోసం విరామం లేకుండానే ప్రయత్నిస్తున్నారు.రకరకాల మార్గాల ద్వారా బీజేపీ అగ్రనేతల ద్వారా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
పార్టీలో పెద్దగా పట్టించుకొన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో, చివరి ఆప్షన్ గా కాంగ్రెస్ కనిపిస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ కి పెద్దగా బలం లేకపోయినా, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ ఇంకా చెక్కుచెదరక పోవడం, వారు తమతో కలిస్తే ఓటు బ్యాంకు పెరుగుతుందని నమ్మకం చంద్రబాబుకు ఉంది.ఏపీలో ఎలా ఉన్నా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుండటం, ప్రశాంత్ కిషోర్ వంటి వారి రాజకీయ అండదండలు ఆ పార్టీకి ఉండటం తదితర అంశాలను చంద్రబాబు గుర్తు చేసుకుంటున్నారు.
అందుకే రాష్ట్రస్థాయి లో ప్రయోజనం కలిగినా, కలుగకపోయినా జాతీయస్థాయిలో ఆ పార్టీ అండదండలు తమకు దక్కితే రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఉండవని చంద్రబాబు ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ కుమారుడి వివాహ వేడుక సందర్భంగా చంద్రబాబు కాంగ్రెస్ నేతలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన తీరు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.వాస్తవంగా సాకే శైలజానాథ్ చంద్రబాబుకు పెద్దగా సన్నిహిత సంబంధాలు లేవు.తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబు మనుషులనే గుర్తింపు పొందారు.
ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉండటంతో పాటు , ఆయన ఈ స్థాయికి రావడానికి చంద్రబాబు సహకారం బాగా పనిచేసింది.ఇప్పుడు సాకే శైలజానాథ్ కుమారుడు పెళ్లికి చంద్రబాబు హాజరు అయ్యారు.
అలాగే రేవంత్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వంటివారు హాజరయ్యారు.ఈ సందర్భంగానే చంద్రబాబు వారితో అనేక కీలక అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
వేరేచోట సమావేశం నిర్వహిస్తే దీనిపై పెద్ద రచ్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పెళ్లి వేడుక నే ఉపయోగించుకున్నట్టుగా అర్థం అవుతోంది.