స్వామిరారా సినిమాతో కమెడియన్ గా క్లిక్ అయిన సత్య ఈమధ్య వరుస సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తున్నాడు.కామెడీలో తనకంటూ సెపరేట్ స్టైల్ తో ఆకట్టుకుంటున్న సత్య లేటెస్ట్ గా హీరోగా ప్రయత్నం చేశాడు.
సందీప్ కిషన్ నిర్మాతగా రాం డైరక్షన్ లో వచ్చిన సినిమా వివాహ భోజనంబు.సోనీ లివ్ లో శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
వివాహ భోజనంబు సినిమా మంచి టాక్ తెచ్చుకోగా ఈ సినిమా తర్వాత కమెడియన్ సత్యకి హీరోగా మరో రెండు అవకాశాలు వచ్చినట్టు తెలుస్తుంది.
ఈసారి ఒక పెద్ద నిర్మాణ సంస్థ సత్యతో ఒక ప్రయోగాత్మక సినిమా చేసేందుకు రెడీ అయ్యిందట.
అంతేకాదు నూతన దర్శకుడు కూడా సత్యతో సినిమా చేస్తున్నట్టు టాక్.ఈ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్ లో వస్తాయని తెలుస్తుంది.
మొత్తానికి ఓ పక్క కమెడియన్ గా చేస్తూనే హీరోగా సత్య చేస్తున్న ఈ ప్రయత్నాలు అతనికి క్రేజ్ తెస్తున్నాయి.సత్య చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
హీరోగా చేస్తున్న తనకు వచ్చే కమెడియన్ అవకాశాలను చేస్తున్నాడు సత్య.