ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం సిమ్లా పర్యటనకు బయలుదేరారు.తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో చండీగడ్ వెళ్లి అక్కడి నుంచి సీఎం ఐదు రోజుల పాటు సిమ్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
వ్యక్తిగత కారణాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సిమ్లా పర్యటన కొనసాగుతోంది సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు కుటుంబ సభ్యులు కూడా సిమ్లా బయలుదేరి వెళ్లారు.పర్యటన ఏర్పాట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్, డీసీపీ హర్షవర్ధన్, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు పర్యవేక్షించారు.
వాస్తవానికి ఆగస్టు నెలాఖరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశాల పర్యటనకు వెళ్లిసి ఉంది.లండన్ ప్యారిస్ పర్యటిస్తారని తొలుత ప్రకటించారు.అయితే షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది.ఈ లోగానే అనూహ్యమైన రీతిలో ఆయన సిమ్లా పర్యటన ఖరారు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింద .ఆగస్టు 31 వరకు అక్కడే ఉండి తిరిగి సెప్టెంబరు 1 వ తేదీన తిరిగి రాష్ట్రానికి రానున్నారు.ఈ పర్యటన పూర్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.